తండ్రికి రామ్ చరణ్ ఇచ్చిన బర్త్ డే గిప్ట్ ఇదే(ఫొటో)
హైదరాబాద్ : ఈ రోజు(శుక్రవారం) చిరంజీవి పుట్టినరోజు. అభిమానులంతా ఓ పండుగ లా ఈ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు సందర్బంగా గిప్ట్ లు ఇవ్వడం జరుగుతూంటుంది. అలాగే తన తండ్రికి రామ్ చరణ్ ఓ కాస్ట్రీ గిప్ట్ అందించారు. చిరంజీవికి లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే... రామ్ చరణ్ ఓ కారుని గిప్ట్ గా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని రామ్‌చరణ్ తన తండ్రికి ల్యాండ్ క్రూజర్ విఎక్స్, వి8 మోడల్‌కి చెందిన కారును బహుమతిగా అందించారు. ఈసారి పుట్టినరోజు వేడుకల్ని నేపాల్‌లో జరుపుకొంటున్నట్టు చిరంజీవి చెప్పారు. దాదాపు కోటిన్నర విలువైన కారు ఇది. గతంలో ఈ హీరో తన తండ్రికి ...రోల్స్ రాయిస్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా తన తండ్రి 150 చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

చిరంజీవి తన 150 వ సినిమా గురించి మాట్లాడుతూ....ఒక నటుడిగా నాపై రెండింతలు ఒత్తిడి కలుగుతోంది. పెద్ద విరామం తర్వాత కెమెరా ముందుకొస్తున్నాను. 'చిరంజీవి మళ్లీ తెరపై ఎలా కనిపిస్తాడో' అనే ఆసక్తి అందరిలోనూ ఉండడం, అంచనాలు పెరగిపోవడం ఇదంతా ఆషామాషీ కాదని నాకు తెలుసు. అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతున్నా. నా నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకొంటారో అవన్నీ వందశాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నాతో పాటు నా నిర్మాత రామ్‌చరణ్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాడు అన్నారు.


Click it and Unblock the Notifications











