హిట్ కొట్టు...చిరు 150 సినిమా పట్టు

By Srikanya

హైదరాబాద్ : ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం...రామ్ చరణ్ తన తాజా చిత్రం దర్శకుడు కృష్ణ వంశీకి బంపర్ ఆఫర్ ఇచ్చారని. తనతో చేస్తున్న గోవిందుడు అందరివాడేలే చిత్రం సూపర్ హిట్ కొట్టు...నాన్నతో 150 చిత్రం పట్టు అనేది అంటున్నారు. చిరంజీవి 150 వ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాని నేపధ్యంలో ఇది అంతటా చర్చనీయాంశంగా మారింది. కృష్ణ వంశీ కూడా ఎట్టి పరిస్ధితుల్లోనూ గోవిందుడు అందరి వాడేలే మిస్ ఫైర్ కాకూడని ప్రయత్నిస్తున్నాడంటున్నారు.

మరో ప్రక్క కృష్ణ వంశీ సైతం చాలా కాలంగా చిరంజీవి ని డైరక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు రామ్ చరణ్ ఈ 150 వ చిత్రానికి నిర్మాత కాబట్టి...అతన్ని ఒప్పించటం ద్వారా ఈ ప్రాజెక్టులోకి కృష్ణవంశీ ప్రవేశించే అవకాసం ఉంది. ఈ మేరకు కృష్ణ వంశీ సైతం కథను కూడా రెడీ చేసుకున్నట్లు చెప్తున్నారు.

Ram Charan's Bumper Offer - Hit One Get One!

కృష్ణవంశీ మాట్లాడుతూ.... అన్నయ్య చిరంజీవి తో 25ఏళ్ల నుంచి సన్నిహిత సంబంధం నాది. ఎప్పుడో ఒకసారి ఖరీదైన లాండ్‌క్రూజర్‌ కారు అడిగాను. ఏదో మాట వరసకి అడిగితేనే తాళం చెవి నా చేతిలో పెట్టేశారు. కానీ 'నాకు బహుమతులు తీసుకోవడం అలవాటు లేదు అన్నయ్య' అన్నాను. ఆయనేమో 'అన్నయ్య ఇస్తే తీసుకోవాలి' అని కారు తాళాలు చేతికిచ్చారు. అన్నయ్యతో ఎప్పుడో సినిమా చేయాల్సింది. నా మూర్ఖత్వమో, అమాయకత్వమో, పొగరో, చేతగానితనమో, దురదృష్టమో కానీ చేయలేకపోయాను అన్నారు.

రామ్‌చరణ్‌,క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు తాతగా ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు. కృష్ణవంశీ మార్కుకు తగ్గట్టుగానే భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా టీజర్‌ను విడుద చేసారు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X