twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ నిశ్చితార్థం ఖర్చు అంతా?

    By Srikanya
    |

    రామ్‌చరణ్, ఉపాసనా కామినేనిల నిశ్చితార్థమే అందరూ మాట్లాడుకునేంత ఘనంగా జరగనుందని సమాచారం. నవంబర్‌లో వీరి నిశ్చితార్థాన్ని జరపడానికి ఇటు చిరంజీవి కుటుంబం అటు కామినేని కుటుంబం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ నిశ్చితార్థ వేడుకకు హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటలు వేదికగా తీసుకోవటం లేదు. హైదరాబాద్‌కి 105 కిలోమీటర్ల దూరంలోని ఉపాసనా తాతయ్య ఉమాపతికి చెందిన దోమకొండగడిని ఈ నిశ్చితార్థానికి వేదికగా చేయనున్నారు . అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే దోమకొండగడికి సంబంధించిన మరమ్మత్తులను ఆరంభించారు. మూడువందల ఏళ్ల నాటి ఈ కోటను పునరుద్ధరించి, అలంకరింపజేయడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనున్నారని వినికిడి. ఇదిలా వుండగా ఈ నిశ్చితార్థ విందు కూడా అద్బతంగా ఉండబోతోంది. దానికోసం నెల్లూరుకి చెందిన చెయ్యి తిరిగినవారితో మాంసాహార వంటకాలను, తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారితో శాకాహార వంటకాలను వండించనున్నారట. ఇదిలా వుండగా రామ్‌చరణ్, ఉపాసనల నిశ్చితార్థం దోమకొండగడిలో జరుగుతోందని తెలిసి ఆ ప్రాంతాన్ని చూడటానికి సందర్శకులు, హీరో అభిమానుల తాకిడి ఇప్పటినుంచే అధికమవుతోంది.

    ఇక రామ్ చరణ్ తన పెళ్ళి విషయమై మాట్లాడుతూ.. రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నామా లేదా అనేది కాదు...రైట్ పర్శన్ ని చేసుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి అన్నారు రామ్ చరణ్. మీరు త్వరగా పెళ్ళి చేసుకుంటున్నానని భావిస్తున్నారా అని మీడియా వారు ప్రశ్నిస్తే ఆయన ఇలా స్పందించారు. అలాగే కెరీర్ లో సెటిల్ కాని వారు పెళ్లి గురించి ఆలోచించరు. కానీ నేను రాబోయే ఇరవై ఏళ్ళ వరకూ నా కెరీర్ బావుంటుందనే భాటవిస్తున్నాను.ప్రస్తుతం నేను చాలా ఫోకస్ గా ఉన్నాను. ఇదే నా జీవితంలో నేను వివాహం చేసుకోవటానికి సరైన సమయం అని భావిస్తన్నాను అన్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

    English summary
    Ram Charan Tej will soon be getting married to Upasana Kamineni and the engagement is likely to take place in December. Now, the latest buzz is Upasana’s family is planning to hold the engagement at Domakonda Fort.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X