రామ్ చరణ్ టైటిల్ ...“మై నేమ్ ఈజ్ రాజు” కాదు..మరి??

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి "మై నేమ్ ఈజ్ రాజు" అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం...ఈ టైటిల్ కేవలం మీడియాలో ప్రచారంలో ఉన్నది మాత్రమే. ఈ చిత్రానికి "బ్రూస్ లీ" అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే ఈ టైటిల్ తో గతంలో రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రం చేద్దామనుకున్నారు. అల్లరి నరేష్ తో అనుకున్న చిత్రానికి ఈ టైటిల్ అనుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రంలో హీరో...పాత్ర స్టంట్ మ్యాన్ కావటంతో... ఈ టైటిల్ అయితే యాప్ట్ గా ఉంటుందని దర్శక,నిర్మాతలు ఫీలయ్యి ఫిక్స్ అయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు. ఇంతకీ ఈ టైటిల్ ..రామ్ చరణ్ కు ఎలా ఉంటుందంటారు...క్రింద కామెట్లతో పంచుకోండి.

అలాగే ...ఈ చిత్రం చిరంజీవి తో దాదాపు 30 సంవత్సరాల క్రితం తీసిన విజేత కథకు చాలా దగ్గర పోలికలు ఉండబోతున్నట్లు చెప్తున్నారు. ఈ కథలో ఎమోషన్స్ ,సెంటిమెంట్ ని, కథ నడిచే విధానాన్ని ఈ కాలానికి తగినట్లు మార్చి, శ్రీను వైట్ల మార్క్ పూర్తి ఎంటర్టైన్మెంట్ తో మిక్స్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

Ram Charan’s film title – “Bruce Lee”

అందుతున్న సమాచారం ప్రకారం...ఈ చిత్రం కథలో రామ్ చరణ్ కు తన అక్క (కృతి కర్బందా) మధ్య వచ్చే ఎమోషన్స్ బేస్ చేసుకుని నడుస్తుందంటున్నారు. అక్క కోసం ఎంతకైనా, ఏదైనా చేసే తమ్ముడు రాజు పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. అక్క కోసం తన కెరీర్ ని, తన ఆశయాలని కూడూ త్యాగం చేస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ...స్టంట్ మ్యాన్ గా కనిపించి అలరించనున్నాడని టాక్.

ఇక ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్‌, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్‌ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.

ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X