For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ న్యూస్: రామ్ చరణ్, వినాయిక్ చిత్రం టైటిల్

  By Srikanya
  |

  హైదరాబాద్: రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా కలకత్తా షెడ్యూల్ లో ఫస్ట్ లుక్ పిక్చర్స్ ని విడుదల చేసిన ఆ టీమ్ ఇప్పుడు సినిమా టైటిల్ పై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఆ టైటిల్ గా నాయక్ అని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వినాయిక్,ఆయన నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ టైటిల్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి 150 సినిమాకు పనికిరావచ్చు కానీ, యంగ్ హీరోకు పనికి వస్తుందా అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ మధ్య ఈ చిత్రానికి చెర్రీ అనే టైటిల్ ని కూడా పెట్టే అవకాసం ఉందని వార్తలు వచ్చాయి. చెర్రీ అనేది రామ్ చరణ్ ముద్దు పేరు.

  ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్‌ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. దర్శకుడు వినాయక్‌ చిత్రం గురించి చెబుతూ ''చిరంజీవిగారితో 'ఠాగూర్‌' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తామని అన్నారు. అలాగే, మా చిత్రం చాలా బలమైన కథతో రూపుదిద్దుకొంటోంది. చిరంజీవి అభిమానులు ఆశించే అన్ని హంగులూ ఉంటాయి. ఇప్పుడు చిత్రిస్తున్న సీన్స్ కథలో చాలా కీలకమైనవి అన్నారు.

  వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం చెర్రీ. ఈ చిత్రం బిజినెస్ అప్పుడే ప్రారంభమై మంచి ఊపు మీద ఉంది. రోజూ విపరీతంగా ఎంక్వైరీలు వస్తున్నాయని, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు చాలా ఉత్సాహం చూపిస్తున్నారని వినికిడి. తాజాగా గుంటూరు లోని హరి ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని మూడు కోట్ల నలభై లక్షలకు తీసుకున్నారు. ఇది రికార్డు అని చెప్తున్నారు. వివి వినాయక్,రామ్ చరణ్ కాంబినేషన్ భాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని భావించి ఈ రేంజి రేట్లు పలుకుతున్నాయి.

  కాజల్ అగర్వాల్, అమలా పౌల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్వి పాత్రాభినయం చే్స్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా సాగనుంది. అలాగే చిరంజీవి సూపర్ హిట్ శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో పాట ను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. రామ్ చరణ్,కాజల్ పై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

  ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

  English summary
  Sources say that Ram Charan and VV Vinayak combination movie is titled Nayak, which is produced by DVV Danayya under Universal media banner. It seems that the producer has registered a movie name ‘Nayak’ in film chamber and the makers looks happy with the title. Kajal is playing heroine beside Ram Charan in this Cherry movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X