రాంచరణ్‌తో ప్రారంభం.. బాహుబలి స్ట్రాటజీ మొదలు పెట్టిన రాజమౌళి!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాజమౌళి కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించేశారు. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి వార్త అభిమానులని ఉత్కంఠకు గురిచేస్తోంది. రాజమౌళి గత కొన్ని రోజులుగా రాంచరణ్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నాడు. ఇక జూ. ఎన్టీఆర్ తన లుక్ లుక్ కోసం దుబాయ్ వెళ్ళాడు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబందించిన ట్రైనింగ్ కూడా అక్కడ ఉంటుంది. ఇక రాజమౌళి తన చిత్రాల పబ్లిసిటీ విషయంలో ప్రత్యేకమైన స్ట్రాటజీని పాటిస్తాడు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి కూడా ఆ తరహా వార్తలు వస్తున్నాయి.

వర్కింగ్ టైటిల్ మాత్రమే

వర్కింగ్ టైటిల్ మాత్రమే

రాజమౌళి ఇంతవరకు ఆర్ఆర్ఆర్ టైటిల్ కూడా ప్రకటించలేదు. ఆర్ఆర్ఆర్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇప్పటికే రామ రావణ రాజ్యం అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలితో జానపద తరహా కథతో అద్భుతం సృష్టించిన రాజమౌళి ఈ సారి పీరియాడిక్ డ్రామాని ఎంచుకున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్, తమిళ నటుడు సముద్రఖని మినహా మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు.

 బాహుబలి స్ట్రాటజీ

బాహుబలి స్ట్రాటజీ

బాహుబలి చిత్రానికి సంబందించి రాజమౌళి ప్రచారంలో విభిన్నమైన స్ట్రాటజీని పాటిస్తూ వచ్చారు. నటీనటుల పుట్టినరోజులు వారి పాత్రలకు సంబందించిన లుక్స్ విడుదల చేస్తూ ఆసక్తి పెంచాడు. ఆర్ఆర్ఆర్ చిత్ర ఫస్ట్ పోస్టర్ కు ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. మార్చి 27న మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి ఓ పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పోస్టర్ లో రాంచరణ్ లుక్ తో పాటు ఆర్ఆర్ఆర్ టైటిల్ కూడా రివీల్ కానున్నట్లు తెలుస్తోంది.

పీరియాడిక్ డ్రామా

పీరియాడిక్ డ్రామా

ఆర్ఆర్ఆర్ చిత్రం 1920 నాటి బ్రిటిష్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రాంచరణ్ పోలీసుగా, ఎన్టీఆర్ దొంగగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వాతంత్ర సమర నేపథ్యంలో రాజమౌళి బలమైన యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సెట్స్ నుంచి లీకైన బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

 2020లో విడుదల

2020లో విడుదల

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రియమణి, అజయ్ దేవగన్ పేర్లు వినిపిస్తున్నాయి. అలియా భట్, పరిణీతి చోప్రా లాంటి బాలీవుడ్ హీరోయిన్లతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే ఆర్ఆర్ఆర్ పూర్తి కాస్టింగ్ కు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X