రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' టైటిల్ వివాదం
హైదరాబాద్: రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్ ని 'గోవిందుడు అందరివాడేలే' అని ఖరారు చేస్తూ పోస్టర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఖరారు చేసిన ఈ టైటిల్ ఇప్పుడు కాంట్రావర్శిలో ఇరుక్కోనుంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ టైటిల్ ని ఆల్రెడీ ఓ కొత్త దర్శకుడు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసి కొత్త వాళ్లతో షూటింగ్ మొదలు పెట్టారు. దాంతో నిర్మాత బండ్ల గణేష్ ఈ టైటిల్ కోసం ఆ దర్శక,నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటం విశేషం. కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గతంలోనూ చాలా పెద్ద చిత్రాలకు ఇలాంటి టైటిల్ వివాదాలు ఎదురయ్యాయి. చాలా సార్లు దర్శక,నిర్మాతలు తమ టైటిల్ ని ఫ్యాన్స్ స్పందన తెలుసుకునేందుకుగానూ ముందుగా మీడియాలో ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. అయితే ఆ స్కీమ్ రివర్స్ అయ్యి.... ఆ టైటిల్ ని ఎవరో ఒకరు దాన్ని రిజిస్టర్ చేయటం జరుగుతోంది. అక్కడ నుంచి ఆ టైటిల్ ని ఎంతోకొంత ఇచ్చి సెటిల్ చేసుకోవాల్సిన స్ధితి ఏర్పడుతోంది. గతంలో ఇలా టైటిల్స్ ని అమ్మే బిజినెస్ చాలా జోరుగా జరిగేది. అయితే ఫిల్మ్ ఛాంబర్ చాలా స్ట్రిక్ట్ గా నిర్మాణం మొదలు పెట్టని చిత్రాలకు టైటిల్స్ రిజిస్టర్ చేయలేమని, రూల్స్ మార్చడంతో కొంతవరకూ తగ్గింది. అయితే డిజిటిల్ టెక్నాలిజీ అందుబాటులోకి రావటంతో ఎంతో కొంత చిన్న మొత్తంతో షూటింగ్ మొదలు పెట్టే అవకాసం ఉండటంతో ఆ రూల్ ని సైతం బ్రేక్ చేసి గేమ్ ఆడగలుగుతున్నాయి. దాంతో క్రేజ్ ఉన్న హీరోల సినిమాలకు అడపాదడపా ఇలాంటి టైటిల్ తలనొప్పులు ఎదురౌతూనే ఉన్నాయి.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరింది. ఏప్రిల్ రెండోవారం నుంచి హైదరాబాద్ రామానాయుడు సినీవిలేజ్‌లో ఇల్లు సెట్‌లో, ఆర్‌ఎఫ్‌సిలో తదుపరి షెడ్యూల్‌ని చిత్రీకరించనున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''తెలుగుదనం ఉట్టిపడే కథ కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చి, రామేశ్వరంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. ఏప్రిల్ రెండోవారంలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. రామోజీఫిల్మ్‌సిటీలో కొంతభాగం తెరకెక్కిస్తాం. విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. రామ్‌చరణ్, రాజ్‌కిరణ్, శ్రీకాంత్‌ల మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి'' అన్నారు.
చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్. తాత, మనవడుగా రాజ్‌కిరణ్, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు.
కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు. ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


Click it and Unblock the Notifications











