రామ్ చరణ్ కొంటున్న ఇల్లు కాస్ట్ ఎంత?
ఇప్పటికే చరణ్, ఆయన భార్య ఉపాసన ఆ ఫ్లాట్‌ను చూశారు. ప్రస్తుతం చరణ్ హిందీలో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. ఇటు తెలుగు అటు హిందీ చిత్రాల్లో నటించే ఉద్దేశంలో ఉన్నారాయన. కొద్ది నెలలుగా చరణ్ ముంబయిలో సొంత ఇంటి వేటలో ఉన్నారు. చరణ్ ముంబయిలో ఇంటిని కొనే విషయంలో హిందీ నటులు సంజయ్ దత్, సల్మాన్‌ఖాన్‌లు సలహాలు ఇచ్చినట్లు తెలిసింది.
ఇక రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఎవడు' . ఇప్పటికే చిత్ర వర్గాల్లో మంచి క్రేజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదలకానుంది. ఈ చిత్రం అభిమానులను సైతం ఓ రేంజిలో అలరించే చిత్రం అవుతుందని అంటున్నారు. ఈ చిత్రం పూర్తి స్ధాయి యాక్షన్ తో ఎంటర్టైన్మెంట్ అండర్ కరంట్ గా సాగే చిత్రం అని చెప్తున్నారు.
ఒకరి ఫీలింగ్స్‌ని మరొకరు షేర్ చేసుకుంటే? ఒకరి బాధల్ని మరొకరు బాధ్యతగా స్వీకరిస్తే? వింటానికి సింపుల్‌గా ఉన్న ఈ ప్రశ్నల వెనుక ఓ దావానలమే దాగి ఉంది. దాని ఆంతర్యమే 'ఎవడు'. ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణే ఈ సినిమా. ఆ వ్యక్తులు ఎవరు? వారు పడ్డ సంఘర్షణలేంటి? 'ఎవడు' చిత్రం నేపథ్యం ఇదే. రామ్‌చరణ్ భిన్నమైన పాత్రలో యాంగ్రీ యంగ్‌మేన్‌గా ఇందులో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications












