బండ్ల గణేష్‌తో రామ్ చరణ్ తెగదెంపులు?
అయితే ఫిల్మ్ నగర్ నుంచి తాజాగా బండ్ల గణేష్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. కొరటాల శివతో చేయబోయే 'టాప్ లేచిపోద్ది' సినిమాకు రామ్ చరణ్ నిర్మాతను మార్చాలని డిసైడ్ అయ్యాడని, వేరే నిర్మాతతో ఈ సినిమా చేయాలనే యోచనలో చెర్రీ ఉన్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్న బండ్ల గణేష్.....ఆ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయక పోవడం చెర్రీకి నచ్చలేదట. అదే సమయంలో బండ్ల గణష్ సమయం దొరికినప్పుడల్లా, అసందర్భంగా మెగా ఫ్యామిలీ భజన చేయడం, అతిగా పొగడటం లాంటి గణేష్ చర్యల వల్ల రామ్ చరణ్ బాగా డిస్టర్బ్ అయ్యాడని సమాచారం.
మరో వైపు బండ్ల గణేష్ పెట్టుబడుల వెనక మెగా ఫ్యామిలీలోని ఒక వ్యక్తి హస్తం ఉందనే రూమర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లకు చెక్ చెప్పాలనే ఉద్దేశ్యంలో ఉన్న రామ్ చరణ్.......బండ్ల గణేష్‌ను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాడట. రామ్ చరణ్ తో ఈ సినిమా చేయడానికి గీతాఆర్ట్స్‌తో పాటు, అశ్వినీదత్ రెడీగా ఉన్నారు. మరో వైపు బివిఎస్ఎన్ ప్రసాద్, కెఎస్ రామారావు కూడా 'టాప్ లేచిపోద్ది' సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. త్వరలో నిర్మాత మార్పు విషయం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












