క్రేజీ డైరెక్టర్‌తో రామ్ చరణ్ నెక్స్ట్.. బయటకొచ్చిన ఆసక్తికర వార్త! మెగా అభిమానుల్లో జోష్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ జోష్‌లో ఉన్నారు. గత సినిమా రంగస్థలంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సంపాదించిన చెర్రీ.. హీరోగా, నిర్మాతగా సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారట. అయితే వారిలో ఓ క్రేజీ డైరెక్టర్ స్టోరీ లైన్ విన్న రామ్ చరణ్ పాసిటివ్‌గా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆ వివరాలేంటి? చూద్దామా..

సైరా నరసింహా రెడ్డికి నిర్మాతగా కొణిదెల వారసుడు

సైరా నరసింహా రెడ్డికి నిర్మాతగా కొణిదెల వారసుడు

కొణిదెల వారసుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కొద్ది రోజుల క్రిందట సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించి తండ్రికి కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించారు చెర్రీ. ఇటీవలే సినిమా విడుదల కావడంతో తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో శ్రద్ద తీసుకుంటున్నారట మెగా వారసుడు.

ఎన్టీఆర్‌తో RRR.. ఇదిలా ఉండగానే

ఎన్టీఆర్‌తో RRR.. ఇదిలా ఉండగానే


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి RRR సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు రామ్ చరణ్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో RRR షూటింగ్‌లో పాల్గొంటూనే తన తదుపరి సినిమా కథలు వింటున్నారట రామ్ చరణ్.

 డైరెక్టర్ స్టోరీ లైన్‌.. కనెక్ట్ అయిన రామ్ చరణ్

డైరెక్టర్ స్టోరీ లైన్‌.. కనెక్ట్ అయిన రామ్ చరణ్

ఈ క్రమంలోనే విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ లైన్‌కి రామ్ చరణ్ బాగా కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇమేజ్ తగ్గ ఒక డిఫరెంట్ స్టోరీ ఆయన వినిపించారని, దీనిపై చెర్రీ పాజిటివ్ గా స్పందించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 రామ్ చరణ్ పాసిటివిటీ.. విక్రమ్ బూస్టింగ్

రామ్ చరణ్ పాసిటివిటీ.. విక్రమ్ బూస్టింగ్

గతంలో ఇష్క్, మనం, 24, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలతో ఫేం అయ్యారు విక్రమ్ కుమార్. ఈ బాటలోనే రామ్ చరణ్‌తో భారీ హిట్ ప్లాన్ చేసిన ఆయన.. స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారట. ఎలాగూ చెర్రీ కూడా పాజిటివ్‌గా ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరి కాంబోలోనే రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టు వస్తుందేమో చూడాలి మరి.

 తండ్రితో పాటు చెర్రీ

తండ్రితో పాటు చెర్రీ

ఇక ఇటీవలే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్' సినిమా రీమేక్‌ హక్కులను రామ్ చరణ్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తారనే ప్రచారమూ సాగుతోంది. చూడాలి మరి మెగా టీం ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X