Peddi Pre Release Event: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? రామ్ చరణ్ మూవీ ట్రైలర్ ఎప్పుడంటే?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తోన్న మూవీ పెద్ది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఎప్పుడు? అనే వివరాలు పరిశీలిస్తే..

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు పెద్ది మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి.

Ram Charan s Peddi Pre-Release Event and Trailer Launch Date Buzz Goes Viral

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు అవాంతరాలను దాటుకుని జూన్ 4న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో టాలీవుడ్‌కు ఈ వేసవి వృధా అయ్యింది. ఏప్రిల్ నుంచి మే వరకు పెద్ద సినిమాలు లేకపోవంతో థియేటర్లు వెలవెలబోయాయి. చాలా ఏరియాలలో థియేటర్లు మూతపడే పరిస్ధితి నెలకొంది. అయితే పెద్దితో ఈ లోటు తీరుతుందని సినీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. టాలీవుడ్‌కి 2026 సెకండాఫ్ బాగుంటుందని అంతా భావిస్తున్నారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ ఇతివృత్తంగా తెరకెక్కుతున్న పెద్ది మూవీలో రామ్ చరణ్ ఇప్పటి వరకు క్రికెటర్‌గా, పహిల్వాన్‌గా కనిపించి అభిమానులను అలరించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటు, టీజర్, గ్లింప్స్ అన్నీ అభిమానుల్లో హైప్ పెంచాయి. రిలీజ్ వరకు ఈ బజ్ ఇలాగే ఉంచడానికి ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రయత్నాలు ప్రారంభించింది. అటు నార్త్ అమెరికాలో పెద్ది అడ్వాన్స్ బుకింగ్ మే 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆయన క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్ షోలకు భారీగా టికెట్లు అమ్ముడవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో భారీగా సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పెద్దికి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2వ తేదీన హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుందని ఫిలింనగర్ టాక్. గ్రామీణ వాతావరణం, క్రీడల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్‌ను ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నారట. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ని మే 17, 18 తేదీలలో ఏదో ఒక రోజు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు విడుదల చేస్తే దాని ఇంపాక్ట్ బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: ram charan peddi janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X