రంగస్థలం కథ లీక్.. సుకుమార్ క్రేజీగా.. చెర్రీ సూపర్‌గా.. అనసూయ రోల్‌పై క్లారిటీ..

By Rajababu

Recommended Video

రంగస్థలం కథ లీక్.. చెర్రీ సూపర్‌..అనసూయ రోల్‌పై క్లారిటీ..!

మెగా హీరో రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సుమారు రూ.100 కోట్ల వ్యయంతో రాంచరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాకు సంబంధించిన షూటింగ్ నింపాదిగా నడుస్తున్నప్పటికీ.. వేసవి బరిలో ఈ చిత్రాన్ని వదిలేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ తాజాగా వెలుగులోకి వచ్చింది. మీడియాలో ప్రచారం జరుగుతున్న ప్రకారం రంగస్థలం కథ ఇదేనట..

 తండ్రి హత్యతో

తండ్రి హత్యతో

చిట్టిబాబు (రాంచరణ్) తండ్రి (రాజీవ్ కనకాల) ఓ వర్గానికి నాయకుడు. చిట్టిబాబు చిన్నతనంలోనే వర్గ విభేదాల కారణంగా తండ్రిని కోల్పోతాడు. తన తండ్రిని మట్టుబెట్టిన వారెవరూ అని తెలుసుకొంటూ చిట్టిబాబు వారి భరత పట్టడం సినిమా కథ.

 పగ, ప్రతీకారం మధ్య ప్రేమ

పగ, ప్రతీకారం మధ్య ప్రేమ

తన తండ్రిని ఎందుకు? ఎవరు చంపారనే విషయాన్ని తెలుసుకోవడంపై కథ నడుస్తుందట. పగ, ప్రతీకారం అంశాల మధ్య సమంత, రాంచరణ్ మధ్య ఓ ప్రేమకథ కూడా ఆసక్తికరంగా సాగుతుందట. సినిమా కథ సాధారణంగా అనిపించినా సుకుమార్ స్టయిల్‌లో ఈ చిత్రం ఉంటుందట.

చెర్రీ ప్రియురాలిగా సమంత

చెర్రీ ప్రియురాలిగా సమంత

సమంత ఈ చిత్రంలో లక్ష్మీ అనే పాత్రను పోషిస్తున్నారనేది లేటేస్ట్ న్యూస్. గ్రామీణ ప్రాంత అమ్మాయిగా సమంత విభిన్నమైన పాత్రను పోషిస్తున్నదట. ఈ చిత్రంలో రాంచరణ్, సమంత కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుంది అనేది తెలిసింది.

 60 నుంచి 80వ దశకం మధ్య

60 నుంచి 80వ దశకం మధ్య

రంగస్థలం కథ 60వ దశకంలో ప్రారంభమై 80వ దశకం వరకు సాగుతుందట. అప్పటి వాతావరణం, పరిస్థితులన్నింటిపై పరిశోధన చేసి దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే విధంగా తెరకెక్కిస్తున్నారనేది తాజా సమాచారం.

 20 ఏళ్ల కాల పరిమితి

20 ఏళ్ల కాల పరిమితి

దాదాపు 20 ఏళ్ల కాల పరిమితిలో జరిగే సంఘటనలు, వాటికి సంబంధించిన కథనాలను ఆసక్తికరంగా ఉంటాయనేది సినీ వర్గాల కథనం. ప్రేక్షకులకు మళ్లీ పాత రోజులు గుర్తు తేవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి.

అనసూయ పోలీస్ ఆఫీసర్‌గా

అనసూయ పోలీస్ ఆఫీసర్‌గా

రంగస్థలంలో అనసూయ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. మర్డర్ కేసుకు సంబంధించిన దర్యాప్తును చేపట్టే అధికారిగా అనసూయ కనిపిస్తుందట. ఈ టాప్ యాంకర్ విభిన్నమైన గెటప్‌తో తెర మీద సందడి చేయనున్నారనేది తాజా సమాచారం. ఆది పినిశెట్టి జిల్లాలో ఉన్నతాధికారిగా కనిపిస్తారట.

విలన్ పాత్రలో జగపతి, ప్రకాశ్ రాజ్

విలన్ పాత్రలో జగపతి, ప్రకాశ్ రాజ్

గ్రామంలో ఊరి పెద్దలుగా జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారట. ఈ మోతుబరి రైతులు చేసే కుట్రల కారణంగానే రాంచరణ్ కుటుంబం బలైపోతుందట. ఇలాంటి కథతో రంగస్థలం ముస్తాబవుతున్నది.

 మార్చి 30న రిలీజ్

మార్చి 30న రిలీజ్

భారీ తారాగణం, బడ్జెట్‌తో రూపొందిన రంగస్థలం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంపై భారీ మొత్తంలో అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X