రంగస్థలం ఎఫెక్ట్.. కేరళలో భారీగా రాంచరణ్ సినిమా!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి శ్రీను సినిమాల్లో ఉండే అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. రంగస్థలం చిత్రం అందించిన ప్రోత్సాహంతో రాంచరణ్ కన్ను పరభాషలపై కూడా పడింది. మగధీర టైం నుంచే రాంచరణ్ చిత్రంలో మలయాళంలో బాగానే రాణిస్తున్నాయి. వినయ విధేయ రామ చిత్రంతో కేరళలో తన మార్కెట్ పెంచుకోవాలని రాంచరణ్ భావిస్తున్నాడు.

రికార్డు విజయం

రికార్డు విజయం

రాంచరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన రంగస్థలం చిత్రం మాలయాళంలో కూడా విడుదలై విజయం సాధించింది. దీనితో క్రమంగా తన మార్కెట్ పరిధిని పెంచుకోవడంపై రాంచరణ్ దృష్టి పెట్టాడు.రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ చిత్రం కేరళ విడుదల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. కళ్ళు చెదిరే ధరకు ఈ చిత్ర కేరళ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

 తీవ్రమైన పోటీ

తీవ్రమైన పోటీ

వినయ విధేయ రామ చిత్ర కేరళ హక్కులు దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పోటీలో వివిఆర్ డిస్ట్రిబ్యూటర్స్, ప్రకాష్ ఫిలిమ్స్ సంస్థ సంయుక్తంగా భారీ వెచ్చించి వినయ విధేయ రామ కేరళ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంత మొత్తానికి అమ్మారు అనే విషయం బయటకు రాలేదు.

 అత్యధిక థియేటర్స్‌లో

అత్యధిక థియేటర్స్‌లో

రాంచరణ్ సినిమాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళలో వినయ విధేయ రామ చిత్రాన్ని అత్యధిక థియేటర్స్ లో విడుదుల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోల్లో ఆ మాటకు వస్తే టాలీవుడ్ హీరోల్లోనే ఎక్కువ మార్కెట్ కేరళలో అల్లు అర్జున్ కి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

Recommended Video

Chiranjeevi Gives Green Signal To Boyapati Srinu | Filmibeat Telugu
కైరా అద్వానీ

కైరా అద్వానీ

భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. స్నేహ, తమిళ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తుండడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రాన్ని స్వరాలు సమకూరుస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 11 న విడుదుల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X