అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ తో రామ్ చరణ్

By Srikanya

రామ్ చరణ్ రీసెంట్ గా అమితాబ్‌ 'జంజీర్‌'ని రీమేక్ చేయటంతో బాలీవుడ్ కి ప్రయాణం కడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ వరస సినిమాలతో బిజీ అవుతున్న రామ్ చరణ్ కి హటాత్తుగా అక్కడికి వెళ్లాల్సిన పని ఏమి వచ్చిందనే సందేహం అందరిలోనూ కలిగింది. అయితే దీని వెనక రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు. మిగతా హీరోలంతా తమ మార్కెట్ లను తమిళ,మళయాళ భాషల్లో పెంచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మగధీర తో ఆ ప్రయత్నం విజయవంతంగా చేసిన చరణ్ ఈ సారి పూర్తిగా నేషనల్ మార్కెట్ పై కన్ను వేయటమే దీనికి కారణం.

అయితే అందుకు స్ట్రెయిట్ సబ్జెక్టునే ఎన్నుకోవచ్చు లేదా...తమ మగధీరను రీమేక్ చేస్తూ లాంచ్ కావచ్చు. కానీ జంజీర్ ని ఎత్తుకోవటంతో ఓ స్ట్రాటజీ ఉందంటున్నారు. జంజీర్ అనేది అమితాబ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. జంజీర్ ని రీమేక్ చేయటం ద్వారా అక్కడ మీడియా దృష్టిని తన వైపుకు తిప్పుకోవచ్చు. అలాగే అమితాబ్ అభిమానులందురూ తన సినిమాను ఎలా రీమేక్ చేసారన్న కుతూహలంతో అయినా చూడ్డానకి వస్తారు. దీంతో సినిమా రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ జరుగుతుంది. అదే అమితాబ్ లింక్ లేకుండా డైరక్ట్ గా లాంచ్ అయితే ఈ ఎక్సపోజర్ ఏమీ ఉండదు. ఇదంతా రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్ అని,దాని వెనక అల్లు అరవింద్ ఉన్నాడని చెప్తున్నారు.

ఇక 'జంజీర్‌'ను ఎంచుకోవడంలో చరణ్‌ తెలివి ఉందని చెప్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర. చిరంజీవి సైతం తెలుగు 'అంకుశం'రీమేక్ 'ప్రతిబంధ్‌' లో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర ద్వారా బాలీవుడ్‌కు ఎంటర్‌ అయ్యారు. అదే పంథాను చరణ్‌ ఫాలో అవుతున్నాడని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు అమితాబ్‌ పాత చిత్రం రీమేక్‌ చేసి షారుక్‌ఖాన్‌ 'డాన్‌'తో విజయం సాధించాడు. రామ్ చరణ్‌ 'జంజీర్‌' చేయడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

మిగతా యంగ్ హీరోలంతా తమిళ, మలయాళ చిత్రాలపై దృష్టి పెడుతుంటే చరణ్‌ మాత్రం హిందీ చిత్రాలపై దృష్టి పెట్టడం చేస్తున్నాడు. అతని స్నేహితుడు రానా కూడా హిందీ మార్కెట్లో ప్రవేసించటానికి వర్మ అండతో విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా అంతర్జాతీయ మార్కెట్‌ కోసమే అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక జంజీర్ రీమేక్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం దాదాపు డబ్బై కోట్ల వరకూ బడ్జెట్ తో నిర్మితం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X