»   » రామ్ చరణ్ హీరోగా...సూపర్ స్టార్ నిర్మాతగా ఖరారు

రామ్ చరణ్ హీరోగా...సూపర్ స్టార్ నిర్మాతగా ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : 'జంజీర్‌' (తుఫాన్) రీమేక్ సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రామ్‌చరణ్‌. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా విమర్శకుల చేత ఓ రేంజిలో కామెంట్స్ చేయించేలా చేసింది. అయితే పట్టువదలకుండా తాజాగా మరో చిత్రం చేయడానికి రామ్‌చరణ్‌ సన్నాహాలు చేసుకొంటున్నారని తెలిసింది.

ఈ కొత్త బాలీవుడ్ చిత్రానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. 'జంజీర్‌' చిత్రీకరణ ముంబయిలో జరుగుతున్నప్పుడు చరణ్‌కి సల్మాన్‌ ఆతిథ్యం ఇచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో 'ఎవడు' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు కూడా ఆ సెట్లో సల్మాన్‌ ఖాన్‌ సందడి చేశారు. అప్పట్నుంచి వీరిద్దరూ కలిసి ఓ సినిమాకి పనిచేస్తారనే ప్రచారం మొదలైంది.

ఇటీవల రామ్‌చరణ్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2014 ఏడాది ప్రారంభంలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, జంజీర్ లో ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యారని, అది ఈ కొత్త చిత్రంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుని సెట్స్ మీదకు వెళ్తారని చెప్తున్నారు.

ఇక ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ కూడా రామ్‌చరణ్‌ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో చరణ్‌ నటిస్తేనే బాగుంటుందని అశుతోష్‌ భావిస్తున్నారట. 'మగధీర' చిత్రాన్ని చూశాక ఆయన ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.ఇందుకోసం ప్రత్యేకంగా మగధీర ప్రింట్ తెప్పించుకుని మరీ చూసాడని చెప్తున్నారు. రామ్ చరణ్ కూడా ఆయనతో చేయాలని ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. 'మగధీర' చూసి ఇంప్రెస్ అయ్యే ఆఫర్...? రామ్ చరణ్ ఇక ఈ చిత్రం భారీవ్యయంతో ఈ చిత్రం రూపొందబోతున్నట్టు సమాచారం.

చారిత్రాత్మక అంశాలతో సినిమాలు తీయడంలో అశుతోష్‌ ముందుంటారు. ఇదివరకు ఆయన 'లగాన్‌', 'జోథాఅక్బర్‌' అనే చిత్రాల్ని తెరకెక్కించారు. 'లగాన్‌' ఆస్కార్‌ పురస్కారాన్ని తృటిలో కోల్పోయింది. ఇప్పుడు మరో చారిత్రిక కథాంశంతో అశుతోష్ ముందుకు వచ్చారని తెలుస్తోంది. తెలుగు,హిందీ మార్కెట్ లకు రామ్ చరణ్ అయితే వర్కవుట్ అవుతాడని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కే పీరియడ్ డ్రామాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం కొంత టైం తీసుకొంటుందని అంటున్నారు. ఈ సినిమా 2014 చివర్లో గానీ లేదా 2015 మొదట్లో గానీ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబందించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Ram Charan in Salman Khan's production movie confirmed and Charan going to do two other movies in Bollywood.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu