రామ్ చరణ్- సమంత.. మరోసారి వెండితెర రొమాన్స్ చేసేందుకు రెడీ అయిన సక్సెస్‌ఫుల్ జోడీ!
వెండితెరపై కొందరు హీరోహీరోయిన్ల మధ్య సూపర్ కెమిస్ట్రీ కుదురుతుంది. ఆ హీరోతో ఈమె తప్ప మరే హీరోయిన్ చేసినా ఆ కిక్కు రాదు బాబూ! అనేంతలా కొన్ని జోడీలు ఆకట్టుకుంటాయి. అందుకే కొన్ని సక్సెస్‌ఫుల్ జోడీల జర్నీ ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతుంది. ఆనతి నుంచి నేటి వరకూ ఇలాంటి సూపర్ హిట్ జోడీలు చాలానే ఉన్నాయి. అయితే నేటితరంలో అలాంటి జోడీల్లో ఒకటి రామ్ చరణ్- సమంత.

చిట్టిబుబాబుతో రామలక్ష్మి రొమాన్స్
రామ్ చరణ్- సమంత ఈ జోడీ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది 'రంగస్థలం' మూవీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టిబుబాబుగా రామ్ చరణ్, ఆయన ప్రేయసి రామలక్ష్మిగా సమంత ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిలా నిలిచేలా నటనా ప్రతిభ కనబర్చారు.

అక్కినేని కోడలు.. మెగా వారసుడు
అప్పటికే అందరు యంగ్ హీరోల సరసన నటించిన సమంత.. రామ్ చరణ్ తో చాలా ఏళ్ల సమయం తర్వాత జోడీ కట్టింది. కోడలిగా అక్కినేని వారింట అడుగుపెట్టాక, ఈ మెగా వారసుడితో 'రంగస్థలం'లో జోడీ కట్టి భేష్ అనిపించుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్- సమంత జోడీ ఇచ్చిన కిక్ ఎప్పటికీ మరవలేరు ప్రేక్షకులు.

కొరటాల స్కెచ్.. అది కూడా యాడ్ చేస్తూ
అయితే ఈ సక్సెస్‌ఫుల్ జోడీని మరోసారి వెండితెరపై చూపించాలని స్కెచ్ వేశారట కొరటాల శివ. ఈ మేరకు చిరంజీవి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 152లో వీళ్లిద్దరికీ స్క్రీన్ స్పేస్ ఇచ్చారని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ చరణ్- సమంత జోడీకి ఉన్న క్రేజ్ కూడా యాడ్ కావాలని ఆయన ప్లాన్ చేశారట.

అడగగానే ఓకే.. స్క్రీన్ స్పేస్ ఎంతంటే!
తండ్రి చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ చేయమని కొరటాల శివ అడగగానే వెంటనే అగ్రీ అయ్యారట రామ్ చరణ్. దీంతో చెర్రీ కోసం యంగ్ చిరంజీవి పాత్రను, నక్సలైట్ పాత్రను డిజైన్ చేశారట కొరటాల. సామాజిక అంశాలపై ఫోకస్ చేసే కొరటాల చెర్రీకి 40 నిమిషాల స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారని తెలుస్తోంది.

చిరుతో త్రిష.. చెర్రీతో సామ్
అయితే రామ్ చరణ్ జోడీ కోసం ముందుగా కియారా అద్వానీని తీసుకోవాలని అనుకున్న కొరటాల.. పలు కారణాల వల్ల చివరకు సమంతను ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఈ మెగా 152లో చిరంజీవి సరసన త్రిష నటిస్తుండగా.. రెజీనా ఐటెం సాంగ్ చేస్తోంది.
Recommended Video

మెగా 152.. షూటింగ్ అప్‌డేట్
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. చిత్రానికి 'ఆచార్య' అనే టైటిల్ ఫైనల్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











