Acharya మూవీ నుంచి ఆ హీరో సీన్స్ కట్: చిరంజీవి, చరణ్ కనిపించేది అన్ని నిమిషాలు మాత్రమే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి చిరంజీవి తర్వాత ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. దీంతో ఈ ఫ్యామిలీకి సంబంధించిన హీరోల సినిమాలు వస్తున్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఇద్దరు హీరోలు.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటిస్తే.. ఆ హడావిడి ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.

ఇక, ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమే 'ఆచార్య'. మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

 మెగా మల్టీస్టారర్‌గా ‘ఆచార్య'

మెగా మల్టీస్టారర్‌గా ‘ఆచార్య'

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందతోన్న చిత్రమే 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లే బిజినెస్

అంచనాలకు తగ్గట్లే బిజినెస్

మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న మూవీ కావడంతో.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య'ను రూపొందించారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

 రిలీజ్ డేట్.. ట్రైలర్‌తో రికార్డ్

రిలీజ్ డేట్.. ట్రైలర్‌తో రికార్డ్

క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీని ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. పలు కారణాలతో ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నారు. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అలాగే అంచనాలు రెట్టింపయ్యాయి.

ఆచార్య నేపథ్యం ఇదేనంటూ

ఆచార్య నేపథ్యం ఇదేనంటూ

సాధారణంగా కొరటాల శివ సినిమాలు అంటేనే సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ రూపొందించారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడట.

గెస్ట్ రోల్ నుంచి పూర్తి స్థాయి

గెస్ట్ రోల్ నుంచి పూర్తి స్థాయి

వాస్తవానికి 'ఆచార్య' మూవీని చిరంజీవి హీరోగానే మొదలు పెట్టారు. అందులో రామ్ చరణ్‌కు ఓ గెస్ట్ రోల్‌ను రాసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత ఈ పాత్ర నిడివిని పెంచినట్లు వార్తలు వచ్చాయి. దాన్నే నిజం చేస్తూ ఈ సినిమాను మల్టీస్టారర్‌గా రూపొందించారు. ఇక, ఇందులో చరణ్ పాత్ర 40 నిమిషాల వరకూ ఉంటుందని డైరెక్టరే స్వయంగా తెలిపాడు.

రామ్ చరణ్ పాత్ర కట్ చేస్తూ

రామ్ చరణ్ పాత్ర కట్ చేస్తూ

'ఆచార్య' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సినిమా నిడివిపై దర్శకుడు కొరటాల శివ బాగా ఫోకస్ చేశారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి కట్ చేశారనే టాక్ బాగా వినిపిస్తోంది.

ఇద్దరి కాంబో సీన్స్ అంతసేపే

ఇద్దరి కాంబో సీన్స్ అంతసేపే

తాజా సమాచారం ప్రకారం.. 'ఆచార్య' మూవీలో రామ్ చరణ్ పాత్ర 40 నిమిషాలు ఉంటుందట. అయితే, అందులో చిరంజీవితో కలిసి కనిపించేది 25 నిమిషాలేనని తెలిసింది. మిగిలిన 15 నిమిషాల సీన్స్‌లో కొన్నింటిని కట్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికోసం చిరంజీవి నుంచి పర్మీషన్ కూడా తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X