Just In
- 1 hr ago
‘అల.. వైకుంఠపురములో’ అరుదైన ఘనత.. వాళ్ల కోసం ప్రపంచంలోనే భారీ థియేటర్లో స్పెషల్ షో
- 2 hrs ago
గూగుల్ బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్: ‘సాహో’కు షాక్.. తెలుగు సినిమా లేదు కానీ డైరెక్టర్ ఉన్నాడు
- 3 hrs ago
ఆ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోయాడా.. మళ్లీ హీరోయిన్‌కు అవకాశం
- 3 hrs ago
రానా సమర్పణలో కొత్త సినిమా.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్షణం దర్శకుడు
Don't Miss!
- News
అయోధ్యపై మరోసారి వాదనలు ... రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ
- Sports
3rd T20లో టీమిండియా ఘన విజయం: 2-1తో సిరిస్ కైవసం
- Lifestyle
సుఖంగా నిద్రపోవాలి అంటే ఈ పోషకాహారాలను తప్పనిసరిగా తీసుకోండి..
- Technology
డిజిటల్ వ్యసనంలో పడితే ఈ భయంకరమైన చిక్కులు తప్పవు
- Automobiles
జావా మోటార్సైకిళ్లకోసం ఎదురుచూడాల్సిన కాలం కేవలం 5నెలలు మాత్రమే
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అయ్యో.. కొరటాలతో రామ్ చరణ్ ఇలా అనేశారా? చిరంజీవి రియాక్షన్ ఎలా ఉంటుందో మరి!
ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం లాభాలు తెచ్చిపెట్టలేక పోయింది. దీంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కొరటాల సినిమాపై పడుతోందని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? కొరటాల సినిమాపై పడుతున్న ఎఫెక్ట్ ఏంటి? ఆ వివరాలు చూద్దామా..

వరుసగా తండ్రి సినిమాలకు కొడుకు రామ్ చరణ్
సినిమాల్లోకి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక ఆయన సినిమాల నిర్మాణ బాధ్యతలను కొడుకు రామ్ చరణ్ చేపడుతున్నారు. ఖైదీ నెంబర్ 150, ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్.. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిరంజీవి 152వ సినిమాకు కూడా నిర్మాత బాధ్యతలు చేపట్టబోతున్నారు.

భారీ బడ్జెట్ కేటాయించారు.. కానీ చివరకు!
అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాపై భారీ లాభాలు గడించిన రామ్ చరణ్.. సైరా నరసింహా రెడ్డి సినిమాపై ఊహించిన మేర లాభాలు రాబట్టలేకపోతున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి నిర్మించడమే గాక ఐదు భాషల్లో విడుదల చేసిన ఈ సినిమా అనుకున్న మేర కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమవుతోంది. కంటెంట్ పరంగా రెస్పాన్స్ బాగానే ఉన్నా కమర్షియల్ పరంగా డీలా పడింది. దీంతో చిరు 152 సినిమా విషయంలో చెర్రీ.. ఓ నిర్ణయానికి వచ్చారట.

కొరటాల శివతో రామ్ చరణ్ చెప్పేశాడు
కొరటాల శివ- చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమాపై బడ్జెట్ కంట్రోల్ చేయాలని భావిస్తున్నారట చెర్రీ. భారీ బడ్జెట్ కేటాయించి చేతులు కాల్చుకునే దానికన్నా సింపుల్ గా ఖైదీ నెంబర్ 150 రేంజ్లో సినిమా రూపొందించి భారీ లాభాలు రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయం కొరటాల శివతో కూడా రామ్ చరణ్ చెప్పేశారని టాక్ నడుస్తోంది.

కొరటాల శివపై పెద్ద బాధ్యత
ఈ రకంగా 'సైరా' ఎఫెక్ట్ కొరటాల శివపై పడింది. ఇప్పుడు కొరటాల శివ ఆ ప్రెజర్ తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ 'సైరా' అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టి ఉంటే చిరు 152 సినిమా మరింత భారీగా ఉండేది. కానీ ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. అంటే కొరటాల శివపై పెద్ద బాధ్యతే పెట్టేస్తున్నారన్నమాట చెర్రీ. సత్తా ఉన్న డైరెక్టర్ కాబట్టి చూడాలి మరి దీన్ని ఎలా డీల్ చేస్తాడో!.

చిరంజీవి రియాక్షన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగా తన టాలెంట్ నిరూపించుకుంటూ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. హీరోగా నటించడం, సినిమాలు నిర్మించడాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్న ఆయన.. ఇప్పుడు చిరు 152 విషయమై కాస్త వెనకడుగు వేస్తున్నారనని తెలియడంతో, మరి దీనిపై చిరంజీవి చిరంజీవి రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

రెగ్యులర్ షూట్ ఎప్పటినుంచంటే..
ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని లాంఛనంగా ప్రారంభమైన చిరు 152 నవంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుంది. చిత్రంలో నటించబోయే హీరోయిన్, ఇతర వివరాలు అతిత్వరలో ప్రకటించనున్నారు కొరటాల.