బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్.. మామూలు ప్లాన్ కాదుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 'RRR' తర్వాత గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించిన చరణ్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌లను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'పెద్ది' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక బాలీవుడ్‌లో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. చరణ్ ఈ కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో RC17 ప్రారంభం కానుంది. జులై ఆగస్టు లేదా నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌లు మధ్యలోనే చరణ్ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Ram Charan Set for Grand Bollywood Comeback With Bhansali After Peddi Success

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఆయన ఇటీవల భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో 'సుహెల్ దేవ్' కథతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉన్నా అది ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం కొత్త కథతో ఈ కాంబో ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ఒక పీరియడ్ జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది.హిస్టారికల్ కథలతో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన భన్సాలీ, ఈసారి అడవి నేపథ్యంలో సాగే కథను ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర పూర్తి స్థాయి యాక్షన్, అడ్వెంచర్ మేళవింపుతో ఉండబోతుందని టాక్.

ఈ ప్రాజెక్ట్‌కు కథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించినట్లు టాక్. ఆయన ఐడియాను ఆధారంగా తీసుకుని 'గుల్లక్' ఫేమ్ రైటర్ దుర్గేష్ సింగ్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేసినట్లు సమాచారం. హీరోయిజం, ఎమోషన్, యాక్షన్ అన్నీ కలిపి ఈ సినిమా ఒక భారీ విజయం ఎక్స్‌పీరియన్స్‌గా నిలవనుందని అంచనాలు ఉన్నాయి.

ఇక భన్సాలీ ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాకే చరణ్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లోపు స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కూడా భన్సాలీని కలిసినట్లు వార్తలు రావడం ఆసక్తిని పెంచింది. అయినప్పటికీ, ప్రస్తుత రామ్ చరణ్ ప్రాజెక్ట్‌కే ప్రాధాన్యతనిస్తూ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

చరణ్ గతంలో బాలీవుడ్‌లో చేసిన జంజీర్ పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 'RRR'తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్, పాన్ ఇండియా క్రేజ్ అన్నీ కలిపి ఈసారి ఆయన బాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను హిందీ, తెలుగు సహా పలు భాషల్లో డబ్ చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్, గ్రాండ్ సెట్స్, హాయ్ ఎండ్ విజువల్స్ అన్నీ కలిసి ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇలా 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. మరి రామ్ చరణ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X