Ram Charan సీక్రెట్ బిజినెస్ ప్లాన్?.. తరచూ ముంబైలో తేలుతున్న మెగా పవర్ స్టార్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపారాలను విస్తరించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ మీద కన్ను వేసిన రామ్ చరణ్ తేజ తన ఫిలిం మార్కెట్ తో పాటు వ్యాపారాలను కూడా పాన్ ఇండియా రేంజ్లో విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆ వివరాల్లోకి వెళితే

వ్యాపారం చేయడానికి

వ్యాపారం చేయడానికి

మన సినిమా హీరోలు ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇప్పుడు వ్యాపారం చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో అందరు హీరోలు కూడా దాదాపు ఏదో ఒక రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అదే బాటలో రామ్ చరణ్ తేజ్ కూడా 2013వ సంవత్సరంలో ఒక ఎయిర్ లైన్స్ కంపెనీ ప్రారంభించారు. దానిని నెమ్మదిగా విస్తరించే పనిలో ఉన్నారు రామ్ చరణ్ తేజ..

కొత్త వ్యాపారాలు?

కొత్త వ్యాపారాలు?


అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా ముంబైలో కనిపిస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఆయన ముంబై వెళ్ళేది ఈ వ్యాపార నిమిత్తమే అని తెలుస్తోంది కాకపోతే ఎయిర్ లైన్స్ సంస్థని విస్తరించే పనిలో ఉన్నారా లేక కొత్త వ్యాపారాలు ప్రారంభించే పనిలో ఉన్నారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు..

క్లారిటీ లేదు

క్లారిటీ లేదు

నిజానికి ఆయన సతీమణి ఉపాసన తన తాతకు సంబంధించిన అపోలో హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలతో తలమునకలై ఉన్నారు. రామ్ చరణ్ తేజ్ కూడా ఒక పక్క భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో పక్క వ్యాపారం మీద దృష్టి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబై వెళుతున్న సంగతి తెలిసిందే కానీ ఏ పని మీద వెళుతున్నారు? ఎలాంటి బిజినెస్ పని మీద వెళుతున్నారు? అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే


రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే చివరిగా ఆయన బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలో రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటిస్తున్నారు.. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు లో కనిపించనున్నారు.. ఇదే సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా మళ్లీ వాయిదా పడింది మార్చి 25వ తేదీన సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Recommended Video

Acharya Movie Story Based On A Great Book, Here Is the Details | Filmibeat Telugu
శంకర్ - దిల్ రాజు కాంబినేషన్ లో

శంకర్ - దిల్ రాజు కాంబినేషన్ లో

మరోపక్క ఆయన శంకర్ - దిల్ రాజు కాంబినేషన్ లో మరో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్ కి 15 సినిమాగా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ కూడా రాజమండ్రిలో మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభం కాబోతోంద.. శంకర్ సినిమా కావడంతో సినిమా మీద ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో సినిమా మీద అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X