మరోసారి షాక్ ఇచ్చిన శంకర్.. రామ్ చరణ్ సినిమా డౌటే?

కోలీవుడ్ దర్శకుడు శంకర్ మొదటిసారి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 15వ సినిమాగా రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంటుంది అని అభిమానుల్లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా శంకర్ స్టైల్ లో అద్భుతంగా రూపొందుతుంది అని గతంలో ఎప్పుడూ లేని విధంగా రామ్ చరణ్ ను శంకర్ హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో మరొక వార్త అభిమానులను కలవర పెడుతోంది.

సాధారణంగా దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమాను స్టార్ట్ చేసినా కూడా రాజమౌళి తరహాలోనే ఆలస్యం చేస్తూ ఉంటాడు అనే ఒక మెంటల్ బలంగా ఉంది. సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి శంకర్ చేసే ప్రయత్నాలు అయితే అన్నీ ఇన్ని కావు. ఎంత ఆలస్యం అయినా కూడా ప్రాజెక్ట్ అయితే కరెక్ట్ గా ఉండాలని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి అని తెరపైకి తీసుకు వస్తూ ఉంటారు. ఇక రామ్ చరణ్ సినిమా విషయంలో కూడా ఆయన అదే తరహాలో ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో కూడా ఒక మంచి సందేశం ఉంటుందని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక శంకర్ రామ్ చరణ్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నారని తెలుస్తోంది.

Ram charan shankar project another doubt on release date

ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. సినిమాను 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు అని అందరూ అనుకున్నారు. చిత్ర యూనిట్ కూడా అదే టార్గెట్ తో షూటింగ్ పూర్తి చేసుకుంటూ వెళుతోంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం శంకర్ అయితే షూటింగ్ విషయంలో శంకర్ మరికొంత ఆలస్యం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం కూడా ఆయనకు మరింత సమయం అవసరమని తెలుస్తోంది.

అదే విధంగా సినిమా ప్రమోషన్స్ కోసం కూడా కొంత సమయం కావాలి కాబట్టి శంకర్ రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. కానీ దిల్ రాజు మాత్రం సంక్రాంతి ఫెస్టివల్ కు సినిమాను రిలీజ్ చేస్తే బిజినెస్ బాగా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. కానీ శంకర్ మాత్రం పర్ఫెక్ట్ సినిమా కోసం ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. దీంతో రిలీజ్ డేట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. కానీ ముందస్తు ప్లాన్ ప్రకారం అయితే దిల్ రాజు సంక్రాంతి టార్గెట్ ను సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ గా మరొక డేట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X