RC 15 మరో ఆసక్తికరమైన లీక్.. ఆ సెంటిమెంట్ తో శంకర్ బాక్సాఫీస్ ప్రయోగం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మొదటి పాన్ ఇండియా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి.. రాజమౌళి దర్శకత్వంలో చేసినటువంటి RRR సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ తదుపరి సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న తన 15వ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నాడు. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పాయింట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శంకర్ సెంటిమెంట్ తోనే ఆ సినిమాలో ఒక ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ బీభత్సం

బాక్సాఫీస్ బీభత్సం

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేసిన RRR సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించి అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు రామ్ చరణ్ కు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసింది. ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వారి కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నారు. ఇద్దరు హీరోల సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

 సోలో సక్సెస్ కొట్టాలని..

సోలో సక్సెస్ కొట్టాలని..

ఇక రామ్ చరణ్ తేజ్ RRR సినిమా విడుదల కాకముందే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ కు కొన్నిసార్లు బ్రేక్ పడింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తో రామ్ చరణ్ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సోలోగా పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు.

 మంచి మార్కెట్ తో..

మంచి మార్కెట్ తో..


శంకర్ సినిమాలకు నార్త్ ఇండస్ట్రీలో అయితే మంచి డిమాండ్ ఉంది. ఇక తమిళంలో చెప్పనక్కర్లేదు. కన్నడ ముందుగానే రామ్ చరణ్ కు మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కు RC 15 మరింత బజ్ క్రియేట్ చేసింది. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్లో ఈ ప్రాజెక్ట్ ఒక మంచి బిజినెస్ చేయనున్నట్లు అర్థం అవుతోంది.

 శంకర్ సెంటిమెంట్

శంకర్ సెంటిమెంట్


దర్శకుడు శంకర్ తన కెరీర్లో ప్రతిసారి సెంటిమెంట్ ఒక ప్రయోగం చేస్తూ సక్సెస్ అయ్యాడు. అతను చేసిన ప్రతి హీరోను కూడా విభిన్నమైన షేడ్స్ లో చూపిస్తూ ఉంటారు. ఒక్క పాత్రకు మాత్రమే పరిమితం చేయకుండా వారితోనే డిఫరెంట్ షేడ్స్ చూపించడం శంకర్ కు అలవాటు. మొదటి సినిమా నుంచి కూడా ఆ ప్రయోగం సక్సెస్ అవుతూ వస్తోంది. అలాగే రామ్ చరణ్ తో కూడా రెండు భిన్నమైన షేడ్స్ లో చూపించనున్నట్లు సమాచారం.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
 ఆ పాత్రల్లో చరణ్..?

ఆ పాత్రల్లో చరణ్..?


రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఇదివరకే ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఒక పాత్రలో స్టూడెంట్ గా కనిపించబోతున్న చరణ్ మరొక పాత్రలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా దర్శనం ఇవ్వబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ను గతంలో ఎన్నడూ లేనివిధంగా విభిన్నమైన పాత్రల్లో శంకర్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X