రామ్ చరణ్ - శంకర్ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్.. సినిమా కథ ఇదే, మొదలయ్యేది ఎప్పుడంటే?

RRR సినిమా అనంతరం ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరు కూడా అదే ఫ్లోలో వెళ్లాలని ప్లాన్ వేశారు. చాలా తొందరగా సెట్టవ్వబోతున్న పాన్ ఇండియా మార్కెట్ ను ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని ఈ ఇద్దరు పవర్ఫుల్ సినిమాలను లైన్ లో పెట్టారు. ఇక ముందే తారక్ లైనప్ క్లియర్ అవ్వగా మొన్నటివరకు చరణ్ తదుపరి సినిమాపై పలు అనుమానాలు వచ్చాయి. ఇక మొత్తానికి శంకర్ కు లైన్ క్లియర్ అవ్వడంతో RC15ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.

RRR షూటింగ్ పూర్తయినట్లే..

RRR షూటింగ్ పూర్తయినట్లే..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న RRR సినిమాను దర్శకుడు రాజమౌళి ఆల్ మోస్ట్ పూర్తి చేశాడు. కేవలం రెండు పాటలు ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక చిన్న చిన్న సీన్స్ ఏవైనా ఉంటే వీలైనంత తోందరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

లైన్ క్లియర్..

లైన్ క్లియర్..

దాదాపు ఆగస్ట్ నెలలోనే RRR కు సంబంధించిన పనులన్నీ ఫినిష్ అవుతాయట. ఇక ఆ వెంటనే సెప్టెంబర్ లో రామ్ చరణ్ శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తాడని సమాచారం. మొన్నటివరకు ఇండియన్ 2 కోర్టు సమస్యల వలన RC15 ఆలస్యం కావచ్చని అందరూ అనుకున్నారు. కానీ శంకర్ కు అనువుగా తీర్పు రావడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసి రామ్ చరణ్ సినిమాను లైన్ లో పెడుతున్నాడు.

సెప్టెంబర్ లో మొదలు..

సెప్టెంబర్ లో మొదలు..

ఇక సినిమా పనులు సెప్టెంబర్ లోనే మొదలవుతాయట. సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కీయారా అద్వానీ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక శంకర్ దాదాపు పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మరోవైపు అపరిచితుడు 2ను కూడా లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

Recommended Video

Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
సినిమా అసలు కథ

సినిమా అసలు కథ

ఇక రామ్ చరణ్ 15వ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు లీక్ అవుతున్నట్లు టాక్ వస్తోంది. సినిమా అసలు కథ ఇదేనని కూడా అంటున్నారు. ఒక ఐఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రిగా మారితే ఎలా ఉంటుందనే పాయింట్ తోనే కథను రాసుకున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X