పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం.. బాబాయ్ ఎంత చెప్పినా కూడా వినకుండా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇప్పుడు తమ స్టార్ హీరో కోలుకోవాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇటీవల కోవిడ్ బారిన పడిన పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌజ్ లోనే క్వారంటైన్ లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన బాగానే ఉన్నానని చెబుతున్నా కూడా పూర్తిగా కోలుకునే వరకు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు నిద్ర పట్టేలా లేదు. ఇక పవన్ కళ్యాణ్ ను అమితంగా ఇష్టపడే రామ్ చరణ్ ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హెచ్చరించిన పవన్

హెచ్చరించిన పవన్

ఇటీవల తిరుపతి ఎన్నికల ప్రచారం అనంతరం పవన్ కొంత అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆ తరువాత హోమ్ క్వారంటైన్ కు వెళ్లిన పవర్ స్టార్ తనతో గత కొన్ని రోజులుగా దగ్గరగా ఉన్న వారిని కూడా వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని హెచ్చరించారు.

 ఆరోగ్యం కుదుటపడుతోంది

ఆరోగ్యం కుదుటపడుతోంది

ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించిన హెల్త్ పై ఎప్పటికప్పుడు జనసేన సభ్యులు అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక పవన్ కూడా ఆరోగ్య పరిస్థితిపై స్పంధించాడు. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుటపడుతోంది అంటూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక లేఖ ద్వారా తెలియజేశారు. అదే విధంగా ప్రభుత్వం ప్రజల యోగక్షేమాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

భార్య ఉపాసనతో మాట్లాడి

భార్య ఉపాసనతో మాట్లాడి

ఇక పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది అనగానే మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కు వెంటనే ఫోన్ చేసి యోగ క్షేమల గురించి తెలుసుకున్నారు. ఇక రామ్ చరణ్ అయితే భార్య ఉపాసనతో మాట్లాడి బెస్ట్ అపోలో టీమ్ ను కూడా పవన్ దగ్గరకు పంపించారు. వారు నిత్యం పవన్ ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తున్నారు.

రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం

రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం

అయితే పవన్ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ రామ్ చరణ్ మనసు మొత్తం పవన్ పైనే ఉందట. ఇటీవల షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు బాబాయ్ హెల్త్ పై ఫోకస్ పెట్టాలని ఒక రెండు వారాలు ఎలాంటి పనులు పెట్టుకోవడం లేదట. బాబాయ్ పవన్ పూర్తిగా కొలుకునేంత వరకు అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలని డిసైడ్ అయ్యారట.

పవన్ ఎంత చెప్పినా..

పవన్ ఎంత చెప్పినా..

ఇప్పటికే యువ నిర్మాత అయిన నాగ వంశీ పవన్ బాగోగులు చూసుకుంటున్నాడు. నగవంశీ ప్రొడక్షన్ హౌజ్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ తాను చూసుకోగలనని చెప్పినప్పటికీ రామ్ చరణ్ బాబాయ్ హెల్త్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రామ్ చరణ్ నెక్స్ట్ ఆచార్య RRR సినిమాలతో రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X