మెగాస్టార్ ఆచార్యలో ఆ పాత్ర చాలా పవర్ఫుల్.. ఇంటర్వెల్ బ్యాగ్ దద్దరిల్లేలా..

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన రోజుకో రుమార్ అభిమానులను కొంత కన్ఫ్యూజన్ కి గురి చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఆ గాసిప్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక సినిమాలో ఒక అతిధి పాత్ర కోసం రామ్ చరణ్ ని ఎంపిక చేసినట్లు మొదటి నుంచి ఒక టాక్ అయితే వస్తోంది.

ఆ తరువాత మరో హీరోను కూడా అనుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఫైనల్ గా దర్శకుడు రామ్ చరణ్ తోనే ఆ స్పెషల్ పాత్రను చేయించాలని అనుకుంటున్నాడట. సినిమా కథ పరంగా మెగాస్టార్ పాత్ర స్థాయిని అందుకోవాలి అంటే అది చరణ్ వల్లే అవుతుందని ఆడియెన్స్ కూడా పాత్ర విధానాన్ని తప్పకుండా ఇష్టపడతారని దర్శకుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Ram charan special role duration in Megastar acharya

సినిమాలో చరణ్ పాత్రను సెకండ్ హాఫ్ మొత్తం ఉంచాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు దర్శకుడు కొరటాల 30నిమిషాల లోపే ఉంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేవలం 25 నిమిషాలే ఉండవచ్చని కూడా కథనాలు వెలువడుతున్నాయి. సినిమాకు సంబంధించిన షూటింగ్ సగం పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇక మిగతా షూటింగ్ ని కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి సినిమాలో చరణ్ పాత్ర ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. ఇక ఆచార్య సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ లుక్ ని ఈ నెల.22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X