పవన్ కల్యాణ్ మూవీలో రాంచరణ్.. సైరా తరహాలో మెగా హీరో స్పెషల్ రోల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిస్టారికల్ విరూపాక్ష ఎప్పుడు తెరపైకి వస్తుందో గాని సినిమాకు సంబంధించిన గాసిప్స్ మాత్రం ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక సినిమాను చేస్తుండడం అభిమానుల్లోనే కాకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతోంది.
సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా గోల లేకపోయి ఉంటే ఈపాటికే సగం షూటింగ్ పూర్తయ్యేది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాత్రలకు సంబంధించిన యాక్టర్స్ ని దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ చేస్తే గ్యాప్ ఇవ్వకుండా పూర్తి చేసే విధంగా క్రిష్ పక్కా ప్లాన్ తో రెడీగా ఉన్నట్లు సమాచారం.

మెగా హీరో స్పెషల్ రోల్..
ఇక విరూపాక్ష సినిమాలో మరో మెగా హీరో స్పెషల్ పాత్రలో కనిపించనున్నాడు అనే టాక్ వస్తోంది. ఆ మెగా హీరో మరెవరో కాదు. మెగా తనయుడు రామ్ చరణ్. నిజానికి చరణ్ ఎప్పటి నుంచో బాబాయ్ సినిమాలో ఎదో ఒక విధంగా కనిపించాలని చూస్తున్నాడు. కానీ ఇంతవరకు కుదరలేదు. ఇక క్రిష్ విరూపాక్ష కథను ముందే విన్న రామ్ చరణ్ ఒక ఐడియా ఇచ్చాడట.

సైరా తరహాలో..
సైరా సినిమాలో అనుష్క ఎంట్రీతో సినిమా కథ మొదలైనట్లు అదే తరహాలో రామ్ చరణ్ ఎంట్రీతో విరూపాక్ష సినిమాను కూడా మొదలుపెట్టే అవకాశం ఉందట. అంటే రామ్ చరణ్ హిస్టారికల్ పాత్రలో కనిపిస్తాడా లేక ఫిక్షన్ క్యారెక్టర్ లో కనిపిస్తాడా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తప్పకుండా విరూపాక్షలో చరణ్ ఇన్వాల్మెంట్ అయితే ఉండబోతున్నట్లు టాక్.
Recommended Video

త్వరలోనే స్పెషల్ అప్డేట్..
ఇకపోతే సినిమాకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు సినిమా గురించి టైటిల్ ఫస్ట్ లుక్ లపై ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అప్పుడప్పుడు అభిమానులే వారి టాలెంట్ తో ప్యాన్ మెడ్ పోస్టర్స్ క్రియేట్ చేస్తూ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఆగస్ట్ లోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











