శ్రీను వైట్లకు మెగా షాక్ ఇవ్వనున్న రామ్ చరణ్?
హైదరాబాద్: ఇటీవల ‘ఆగడు' సినిమా విడుదలకు ఒక రోజు ముందు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల తన తర్వాతి సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆగడు ఫలితంతో ఈ ప్రాజెక్టుపై పలు అనుమానాలు మొదలయ్యాయి.
‘ఆగడు' సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని ఇటు ప్రేక్షకులు, అటు ఇండస్ట్రీ పెద్దల నుండి అభిప్రాయాలు వెలువడ్డాయి. గతంలో కోన వెంకట్, గోపీ మోహన్‌లతో కలిసి పని చేసి వరుస హిట్లు అందుకున్న శ్రీను వైట్ల వారి సహాయం లేకుండా సొంత కథతో ‘ఆగడు' చిత్రాన్ని తెరకెక్కించాడు. కోన, గోపీ లేని లోటు ‘ఆగడు' సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, వారు ఉంటే ‘ఆగడు' మూవీ ఫలితం వేరేలా ఉండేదని మరికొందరి అభిప్రాయం.

ఈ పరిణామాల నేపథ్యంలో....రామ్ చరణ్ సినిమా విషయంలో సీన్ మారింది. కోన వెంకట్, గోపీ మోహన్‌లతో కలిసి పని చేయాలని శ్రీను వైట్లపై ‘మెగా' ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కోసం అయినా శ్రీను వైట్ల మళ్లీ ఆ ఇద్దరితో కలిసి పని చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ శ్రీను వైట్ల మొండిగా వెళితే ‘మెగా' షాక్ తప్పదని ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే 'చిత్రం చేస్తున్నాడు, ఇది పూర్తి కాగానే కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మించనున్నాడు ,ఇంతకుముందు చరణ్ తో 'నాయక్ ' చిత్రాన్ని నిర్మించాడు దానయ్య. శ్రీను వైట్ల చెప్పిన కథ నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు,ఈ చిత్రం కూడా శ్రీను వైట్ల తరహాలోనే వినోద ప్రధానంగా రూపొందనుంది.


Click it and Unblock the Notifications











