'ఆగడు' ఫలితం : శ్రీనువైట్ల రాత్రింబవళ్లూ అదే పనిలో

By Srikanya

హైదరాబాద్ : హిట్, ఫ్లాఫ్ గేమ్ ల మీద సినీ పరిశ్రమ నడుస్తూంటుంది. హిట్ వస్తే ఆ డైరక్టర్ ని టీమ్ ని ఎత్తేయటం, అదే దర్శకుడు ఆ తర్వాత ఫ్లాఫు ఇస్తే అంతే వేగంగా క్రింద పడేయటం సర్వ సాధారణం. అంతేకాదు హిట్ లో ఉన్నప్పుడు ఉన్న కమిట్ మెంట్స్ సైతం ప్లాపులో కంటిన్యూ కావు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే...ఆగడు ఫ్లాపు తర్వాత శ్రీను వైట్ల, రామ్ చరణ్ ప్రాజెక్టు ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే రామ్ చరణ్ మాత్రం అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని తెలుస్తోంది. తను గోవిందుడు అందరివాడేలా తర్వాత చేస్తాను అని ఇచ్చిన మాట మీదే నిలబడి ఉన్నాడట.

Ram Charan-Srinu Vaitla film not shelved

అయితే రీసెంట్ ఇంటర్వూలో శ్రీను వైట్ల... ఓ వారం టైమ్ ఇవ్వండి... నా తదుపరి చిత్రం వివరాలు ప్రకటిస్తాను అని అనడటంతో అందరిలోనూ రామ్ చరణ్ తో ప్రాజెక్టు లేదనే సందేహాలు వచ్చాయి. కానీ శ్రీను వైట్ల స్క్రిప్టు మీద మరింత కసరత్తు చేస్తూ ఎలాగైనా ఆగడుని మరిచిపోయే హిట్ ఇవ్వాలని రాత్రింబవళ్లూ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త ఇంప్రెవైజేషన్స్ చేసుకుంటూ రామ్ చరణ్ ని కలుస్తున్నాడని తెలుస్తోంది. అయితే గతంలో కన్నా మరింత ఎక్కువగా శ్రీనువైట్ల కష్టపడుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ సైతం ఇన్నాళ్లూ యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా ఉన్న తనను తాను ఫ్యామిలీ హీరోగానూ టర్న్ తీసుకోవాలని నిర్ణయం తీసుకునే కృష్ణవంశీ, శ్రీను వైట్ల చిత్రాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనలో కామెడీ టైమింగ్ సైతం ఉందని ప్రూవ్ చేసుకోవాలే తపనతో ఆయన ఈ నిర్ణయం తీసుకుని శ్రీను వైట్ల తో చేయాలని పిక్స్ అయినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X