ఎట్టకేలకు ఫిక్సైన గేమ్ చేంజర్ రిలీజ్ డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కు రెండు పండుగలు గ్యారెంటీ
తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు హైరేంజ్‌కు వెళ్లిపోయింది. దీంతో ఇక్కడ ఉన్న స్టార్ హీరోలు బడా మూవీలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అలా ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా చిత్రాలతో సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీనే 'గేమ్ చేంజర్'. దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ రూపొందిస్తోన్న ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుంది. దీంతో ఈ మూవీపై హైప్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్లాన్లు చేసుకుంటున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ 2021లోనే ప్రారంభం అయింది. దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తర్వాత 2024 సంక్రాంతికి తీసుకు వచ్చేలా వ్యూహాలు రెడీ చేశారు. కానీ, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాని కారణంగా దీన్ని వాయిదా వేశారు. ఇప్పటికి కూడా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవలేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. ఇలా టాకీ పార్టుతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసి ఈ ఏడాది చివరికి ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రిలీజ్ డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' మూవీని ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారట. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు కూడా స్పష్టం చేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. అదే నిజం అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఒకేసారి రెండు పండుగలు వస్తాయని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











