చిరంజీవితో రామ్ చరణ్ ఫైటింగ్: టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న షాకింగ్ న్యూస్

ఐదారేళ్ల క్రితం నుంచి తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియాలోనే మనది టాప్ ఇండస్ట్రీ అనేంతగా ఎదిగిపోయింది. అదే సమయంలో మన హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్లుగా మారిపోతున్నారు. దీంతో టాలీవుడ్‌లో హై రేంజ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'గేమ్ చేంజర్' అని చెప్పుకోవచ్చు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమానే 'గేమ్ చేంజర్'. దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ రూపొందిస్తోన్న ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుంది. ఇద్దరు స్టార్ల కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Ram Charan Starrer Game Changer Movie Release on 2025 Sankranthi

హై రేంజ్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ 2021లోనే ప్రారంభం అయింది. దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తర్వాత 2024 సంక్రాంతికి తీసుకు వచ్చే ప్లాన్ చేశారు. కానీ, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాని కారణంగా దీన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాలేదు.

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతోంది. ఇలా టాకీ పార్టుతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసి ఈ ఏడాది చివరికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రిలీజ్ డేట్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

Ram Charan Starrer Game Changer Movie Release on 2025 Sankranthi

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయడం లేదట. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారట. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. వాస్తవానికి అప్పుడే చిరంజీవి 'విశ్వంభర' కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 'గేమ్ చేంజర్' కూడా అప్పుడే వస్తే తండ్రి కొడుకుల మధ్య పోటీ ఉండబోతుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X