మెగా ఫ్యాన్స్‌కు బంపర్ న్యూస్.. ఎట్టకేలకు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్‌లో కొంత మంది హీరోలు మాత్రమే తమదైన చిత్రాలను చేస్తూ తమ రేంజ్‌ను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతూ నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్న రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీనే 'గేమ్ చేంజర్'. ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడిపోయింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అందుకే ఈ సినిమా టేకింగ్ చాలా సమయం తీసుకుంటోంది.

Ram Charan Starrer Game Changer Movie Release on December 20th

వాస్తవానికి 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ 2021లోనే స్టార్ట్ అయింది. అప్పుడు దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తర్వాత 2024 సంక్రాంతికి తీసుకు వచ్చే ప్లాన్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ లేట్ అవడంతో ఈ చిత్రం విడుదలపై ప్రభావం పడుతోంది. ఫలితంగా అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు.

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ఇటీవలే హీరో కూడా తన పార్టును పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది.

పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని నిర్మాత దిల్ రాజు కూడా కన్ఫార్మ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నారట. దీనిపై వినాయక చవితి సందర్భంగా అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది.

ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జంటగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X