Game Changer: గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇది మామూలు సర్‌ప్రైజ్ కాదుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎన్నో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు రూపొందుతోన్న విషయం తెలిసిందే. అయితే, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా బజ్‌ను ఏర్పరచుకుని అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటి చిత్రాల్లో గ్లోబల్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీ ఒకటి.
ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీని లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ రూపొందిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నారు.

'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ 2021లోనే ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అవడంతో ఈ చిత్రం విడుదలపై ప్రభావం పడుతోంది. అందుకే దీన్ని గత సంక్రాంతికి తీసుకు రావాలని చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా షెడ్యూళ్లు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌పై అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీని ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన మరికొద్ది రోజుల్లోనే రాబోతుందని తెలిసింది. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











