Game Changer: మరింత ముందుగానే గేమ్ చేంజర్ రిలీజ్.. ఫిక్స్ అయిన డేట్ ఇదే!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్నో రకాల పాన్ ఇండియా మూవీలు రూపొందుతోన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే స్పెషల్‌గా నిలుస్తూ భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' ఒకటి. ఈ మూవీ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది.

వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా మరింతగా ఆలస్యం అవుతూ వస్తోంది. క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే చిత్ర యూనిట్ ఇంత సమయం తీసుకుంటోంది.

Ram Charan Starrer Game Changer Movie Release on October 31st

వాస్తవానికి 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ 2021లోనే ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ లేట్ అవడంతో ఈ చిత్రం విడుదలపై ప్రభావం పడుతోంది. అందుకే దీన్ని గత సంక్రాంతికి తీసుకు రావాలని చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని ఫ్యాన్స్ సహా అందరూ అయోమయంలో ఉండిపోయారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా షెడ్యూళ్లు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇలా రెండు మూడు నెలల్లో షూట్ కంప్లీట్ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని దిల్ రాజు కూడా స్పష్టం చేసేశారు.

Ram Charan Starrer Game Changer Movie Release on October 31st

రాజకీయ నేపథ్యంతో సాగే కథతో రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని మరింత ముందుగానే అంటే.. అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేస్తున్నారట. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే అనొచ్చు.

ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X