Game Changer: రామ్ చరణ్ సినిమా రిలీజ్‌పై క్లారిటీ.. ఏంటి ఆ నెలలోనే వచ్చేస్తుందా!
టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ భారీ పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ తమ రేంజ్‌ను మరింతగా పెంచుకునే పనిలో ఉన్నారు. అలా ఇప్పటికే పలువురు హీరోలు గ్లోబల్ స్టార్లుగానూ పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. RRR చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
వరుస హిట్లతో దూసుకుపోతోన్న రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు వచ్చాయి. ఇలా ఇప్పటి వరకూ దీనికి సంబంధించి 60 శాతానికి పైగానే టాకీ పార్టును పూర్తి చేసినట్లు ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తీసుకు రావాలని ప్లాన్ చేశారు. దీనిపై ప్రకటన కూడా చేశారు. కానీ, అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల ఈ టైంలో సాధ్యం కాలేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీని తర్వాత ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా షెడ్యూళ్లు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

హై రేంజ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీని ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే నిజం అయితే మెగా అభిమానులకు పండుగే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











