పవన్ కల్యాణ్ స్థానంలో రామ్ చరణ్.. ఈ మెగా ట్విస్ట్‌ను ఫ్యాన్స్ తట్టుకుంటారా!
తెలుగు సినిమా పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. చిరంజీవి కుమారుడిగా వచ్చినా.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ గ్లోబల్ స్టార్‌గా దూసుకెళ్తున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు.
లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ రూపకల్పనలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమానే 'గేమ్ చేంజర్'. ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. అందుకే ఈ సినిమా మరింతగా ఆలస్యం అవుతోంది.
నిజానికి 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ 2021లోనే ప్రారంభం అయింది. దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తర్వాత 2024 సంక్రాంతికి తీసుకు వచ్చే ప్లాన్ చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ లేట్ అవడంతో ఈ చిత్రం విడుదలపై ప్రభావం పడుతోంది. ఫలితంగా అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిపై అయోమయం నెలకొంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కలయికలో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఎంతో వేగంగా జరుగుతోంది. దీని తర్వాత ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా షెడ్యూళ్లు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇలా వీలైనంత త్వరగానే షూట్ కంప్లీట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ లీకైంది.

'గేమ్ చేంజర్' మూవీని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నారట. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. వాస్తవానికి అదే రోజున పవన్ కల్యాణ్ 'OG' రిలీజ్ ప్లాన్ చేశారు. అప్పటికి ఈ చిత్రం వచ్చే అవకాశం లేకపోవడం వల్లే 'గేమ్ చేంజర్' రిలీజ్ అవుతుందని అంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జంటగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











