గేమ్ చేంజర్‌కు వెంకటేష్ మూవీ పోలికలు.. రామ్ చరణ్ సీన్స్ మాత్రం దానికి కాపీనే!
తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లోనూ రాణించి స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే మూవీల్లోకి వచ్చిన అతడు.. వరుసగా హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్నాడు. అదే సమయంలో RRR మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే బిరుదునూ అందుకున్నాడు.
ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రమే 'గేమ్ చేంజర్'. లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై హైప్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది.

రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న 'గేమ్ చేంజర్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ 2021 డిసెంబర్‌లోనే ప్రారంభం అయింది. ఆరంభంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో, వైజాగ్‌లోనూ షెడ్యూల్‌లను పూర్తి చేశారు. అయితే, మధ్యలో ఎన్నో గ్యాప్‌లు రావడంతో సినిమా షూట్ చాలా ఆలస్యం అవుతోంది.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో హై రేంజ్‌లో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన స్టోరీ లైన్‌పై ఎన్నో రకాల గాసిప్‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా గతంలో వెంకటేష్ హీరోగా నటించిన 'జయం మనదేరా' సినిమాను పోలి ఉంటుందని తెలిసింది.

ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'గేమ్ చేంజర్' మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించే రామ్ చరణ్ (తండ్రి పాత్ర) 'అభ్యుదయ పార్టీ' నాయకుడిగా కనిపిస్తాడు. ఆ సమయంలో అతడు తక్కువ కులానికి చెందిన ఒకరిని ప్రోత్సహిస్తాడట. అది నచ్చని విలన్ గ్యాంగ్ రామ్ చరణ్‌ను చంపేస్తుందట. ఇదంతా 'జయం మనదేరా' మూవీని గుర్తు చేస్తుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











