గేమ్ చేంజర్ స్టోరీ లీక్.. పవన్ కల్యాణ్ నిజమైన పాత్రలో రామ్ చరణ్

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని తన రేంజ్‌ను పెంచుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్లను సాధించి మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు.

అదే సమయంలో RRR మూవీతో గ్లోబల్ స్టార్‌గానూ ఎదిగిపోయాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ లీకైంది. ఆ వివరాలను మీరే చూసేయండి!

Ram Charan Starrer Game Changer Movie Storyline Reminds Pawan Kalyan Real Story

గేమ్ చేంజర్‌గా రామ్ చరణ్: లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు.

చాలా స్లోగా సాగుతోందిగా: రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న 'గేమ్ చేంజర్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ 2021 డిసెంబర్‌లోనే మొదలైంది. ఆరంభంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో, వైజాగ్‌లోనూ షెడ్యూల్‌లను పూర్తి చేశారు. అయితే, మధ్యలో ఎన్నో గ్యాప్‌లు రావడంతో సినిమా షూట్ లేటుగానే సాగుతోంది.

Ram Charan Starrer Game Changer Movie Storyline Reminds Pawan Kalyan Real Story

కొత్త షెడ్యూల్.. ఇప్పుడవే: 'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఈ వారం నుంచి మొదలుపెట్టారు. అంతేకాదు, ఇందులో రామ్ చరణ్‌తో పాటు ప్రముఖ నటుడు సముద్రఖని కూడా పాల్గొంటారని సమాచారం. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో వీళ్లిద్దరితో పాటు మరికొందరు నటీనటులతో కొన్ని సీన్స్ తీయబోతున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని షెడ్యూళ్లు ప్లాన్ చేసుకున్నారు.

రామ్ చరణ్ రెండు రోల్స్: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే కొన్ని లీకులు వచ్చాయి. అందులో తండ్రి పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌లోనే చూపిస్తారని, మిగిలిన భాగం మొత్తం కొడుకు పాత్రనే హైలైట్ చేస్తారని తెలిసింది. ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుందని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది.

Ram Charan Starrer Game Changer Movie Storyline Reminds Pawan Kalyan Real Story

గేమ్ చేంజర్ స్టోరీ లీక్: హై రేంజ్‌లో తెరకెక్కుతోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన స్టోరీ లైన్‌పై ఎన్నో రకాల గాసిప్‌లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో కొంత భాగం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రియల్ లైఫ్‌ కథతో ఉంటుందట. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పవన్‌ను గుర్తు చేసేలా ఉంటాయని టాక్.

పవన్ కల్యాణ్ కథతోనే: 'గేమ్ చేంజర్' మూవీ ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో కనిపించే రామ్ చరణ్ (తండ్రి పాత్ర) 'అభ్యుదయ పార్టీ' నాయకుడిగా కనిపిస్తాడు. ఆ సమయంలో అతడి నుంచి వచ్చే పొలిటికల్ డైలాగులు, స్పీచ్‌లు అదిరిపోయేలా ఉంటాయట. అవన్నీ జనసేనాని ఇప్పుడు ఫాలో అవుతోన్న మాదిరిగానే ఉంటాయని తెలిసింది. ఒక రకంగా పవన్ నిజమైన పాత్రనే చరణ్ చేస్తున్నట్లు ఉంటుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X