మెగా ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్.. ఆ స్పెషల్ డేన రామ్ చరణ్ ధమాకా
మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే గ్లోబల్ రేంజ్‌కు ఎదిగి సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీనే 'గేమ్ చేంజర్'. లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్ రూపొందిస్తోన్న ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుంది. దీనికితోడు ఇందులో చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

హై రేంజ్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ 2021లోనే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దీన్ని 2023లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తర్వాత 2024 సంక్రాంతికి తీసుకు వచ్చే ప్లాన్ చేశారు. కానీ, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాని కారణంగా దీన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయలేదు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. దీంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రమోషన్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయబోతుంది. ఇలా ఇప్పటికే దీని నుంచి పాట కూడా వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. 'గేమ్ చేంజర్' మూవీ నుంచి టీజర్‌ను వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన మరో రెండు మూడు రోజుల్లో రానుందని అంటున్నారు. ఇది నిజంగానే మెగా అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ అని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











