For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ అనుకుంటే నాగ చైతన్య సెట్ అయ్యాడు.. తెరపైకి ఆసక్తికర విషయం

    |

    సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఓ హీరో కోసం సిద్ధం చేసిన కథ చివరకు మరో హీరో చేత సెట్స్ పైకి వస్తుంటుంది. కొన్ని సినిమాలు స్టార్ హీరోలు వదులుకోవడం, అది మరో హీరోతో తెరకెక్కడం లాంటి పరిణామాలు సాధారణంగా జరిగేవే. అయితే అలాంటి ఓ సందర్భమే మెగా, అక్కినేని వారసుల మధ్య వచ్చిందని తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం సిద్ధం చేసిన కథ నాగచైతన్య చేతికి చిక్కిందని సమాచారం అందుతోంది.

    వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్, కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ.. రామ్ చరణ్‌ని దృష్టిలో పెట్టుకొని ఓ కథ సిద్ధం చేశారట. ఆ కథను చెర్రీకి వినిపించగా ఆయన కూడా ఫిదా కావడంతో తొందరలో సినిమా రూపొందించాలని అనుకున్నాడట. కానీ రామ్ చరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా మేర్లపాక గాంధీ కథను సెట్స్ పైకి తీసుకురాలేక పోతున్నాడు. దీంతో ఇంకా సమయం వృధా చేయడం ఎందుకని ఆ కథను నాగ చైతన్యకు వినిపించగా ఆయన ఓకే చేశారని తెలుస్తోంది.

    Ram Charan story goes to Naga Chaitanya

    ఈ సినిమా కథ థ్రిల్లింగ్ ల‌వ్ స్టోరీ అని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నాగ చైతన్య- మేర్లపాక గాంధీ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య వెంకీమామ సినిమాతో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వెంకీమామ షూటింగ్ పూర్తయింది. ఇక శేఖర్ కమ్ముల సినిమా కూడా పూర్తికాగానే మేర్లపాక గాంధీ సెట్స్ పైకి రానున్నాడట నాగ చైతన్య. ఈ రకంగా రామ్ చరణ్ కి అనుకున్న స్టోరీ నాగ చైతన్యకు రావడం ఆసక్తికర అంశంగా మారింది. కాకపోతే ఇది సినిమా ఇండస్ట్రీ కదా! అధికారిక ప్రకటన వస్తే తప్ప ఏదీ నమ్మలేం.

    English summary
    Merlapaka Gandhi narreted the story to Ram Charan. But Ram charan busy with his commitments, so Merlapaka Gandhi narreted same story to Naga Chaitanya and take green signal from him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X