»   » ‘ఫార్ములా ఎక్స్’...ఇది రామ్ చరణ్ మీద సుకుమార్ ప్రయోగమా?

‘ఫార్ములా ఎక్స్’...ఇది రామ్ చరణ్ మీద సుకుమార్ ప్రయోగమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తో సుకుమార్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. 'ఫార్ములా ఎక్స్' పేరుతో ఈ సినిమా రాబోతోందని అంటున్నారు. టైటిల్ చూసిన వారంతా ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్ అంటేనే...రోటీన్ సినిమాలకు భిన్నంగా ఆలోచించే దర్శకుడు. కెరీర్లో ఇప్పటి వరకు చాలా ప్రయోగాలు చేసిన సుకుమార్ ఈ సారి చెర్రీ మీద 'ఫార్ములా ఎక్స్'ప్రయోగం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ram charan-sukumar

ఈ సినిమాకు సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్ అందిస్తాడని తెలుస్తోంది. ఈ మధ్య రామ్ చరణ్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసి బోల్తా పడుతున్నారు. అందుకే ఈసారి తెగింపు నిర్ణయం తీసుకున్నాడని, సుకుమార్ తో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడని అంటున్నారు.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ధృవ సినిమాతో చెర్రీ బిజీగా ఉండగా, సుకుమార్ తన సినిమాకు ప్రీప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు పూర్తిచేస్తున్నాడట. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఈ ఏడాది ఆగస్టు లేదా, సుప్టెంబర్లో సినిమా ప్రారంభం అవుతుందని టాక్.

English summary
Ram Charan soon might be starting his new project with the Director Sukumar. Latest buzz is the film was titled as Formula X.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu