20 ఏళ్ల బంధానికి బ్రేక్ ? రామ్ చ‌ర‌ణ్‌ కోసం సుకుమార్ అలా చేస్తున్నాడా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో మరోసారి చేతులు కలపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడని టాక్.

అదేంటో కాదు.. మ్యూజిక్ గురించి.. టాలీవుడ్‌లో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ఇద్దరూ కలిసి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేశారు. 'ఆర్య' నుంచి 'పుష్ప-2' వరకు వచ్చిన ప్రతి సినిమాలోనూ దేవిశ్రీ సంగీతం కీలక పాత్ర పోషించింది. సుకుమార్ కథలకు దేవిశ్రీ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఈ జోడీని టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకుడు-సంగీత దర్శకుడు కాంబినేషన్లలో ఒకటిగా భావిస్తారు.

Ram Charan-Sukumar Film Will DSP Continue or Is a New Music Director on the Cards

అయితే ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబోపై అనూహ్యమైన చర్చ మొదలైంది. రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్‌ను సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారట. దీంతో ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు సుకుమార్ తన కెరీర్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ను వదిలి వేరే సంగీత దర్శకుడితో సినిమా చేయలేదు. ఆర్య, జగడం,ఆర్య-2, 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప-2 వంటి సినిమాలకు దేవిశ్రీనే సంగీతం అందించాడు. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం, స్నేహం ఇండస్ట్రీలో ఆదర్శంగా నిలిచింది.

కానీ 'పుష్ప-2' సమయంలో పరిస్థితులు కాస్త మారినట్లు కనిపించాయి. సినిమా విడుదలకు ముందు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. కొన్ని కీలక సన్నివేశాలకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన చిత్రబృందం, ఇతర సంగీత దర్శకుల సహాయాన్ని కూడా తీసుకుందనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో దేవిశ్రీ కూడా పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడని టాలీవుడ్‌లో చర్చ నడిచింది.

ఇప్పుడు దేవిశ్రీ కెరీర్ మరో కొత్త మలుపు తిరుగుతోంది. సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'యెల్లమ్మ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ నిర్ణయం తర్వాత ఆయన మ్యూజిక్ ప్రాజెక్టులపై ఫోకస్ తగ్గుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను కూడా ఆయన పూర్తి చేయలేకపోయాడనే టాక్ వినిపించింది. దీంతో సంగీత దర్శకుడిగా దేవిశ్రీ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్-సుకుమార్ సినిమా ఇంకా ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభ దశలోనే ఉంది. కథ లాక్ అయినప్పటికీ పూర్తి స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే సాంకేతిక నిపుణుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. అందువల్ల ఇప్పుడే దేవిశ్రీని తప్పిస్తున్నారనే వార్తలకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. ఈ కథ స్వభావం, సినిమాకు అవసరమైన సంగీతం, అప్పటి పరిస్థితులు, దేవిశ్రీ అందుబాటు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే సుకుమార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గతంలో కూడా దేవి శ్రీ పై ఎన్నో విమర్శలు వచ్చినా, సుకుమార్ మాత్రం అతడిపై నమ్మకం కోల్పోలేదు. అందుకే ఈసారి కూడా చివరికి దేవిశ్రీకే అవకాశం దక్కే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం.

ఇక రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'రంగస్థలం' తర్వాత మరోసారి చరణ్-సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడి ఎంపిక కూడా కీలకంగా మారింది. దేవిశ్రీ కొనసాగుతాడా? లేక సుకుమార్ తన కెరీర్‌లో తొలిసారి కొత్త సంగీత దర్శకుడితో ప్రయోగం చేస్తాడా? అన్న ప్రశ్నకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X