రాంచరణ్, సుకుమార్ కథ లీక్.. ఇంటర్నెట్‌లో చక్కర్లు!
రాంచరణ్, సుకుమార్ తీసున్న చిత్రానికి సంబంధించిన కథ లీకయిందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఆయన నిర్మించిన చిత్రాలు విమర్శల ప్రశంసలూ అందుకున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ లీకయిందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.

ఇంటర్నెట్‌లో ప్రచారమవుతున్న ప్రకారం.. హీరో పల్లెటూరి అబ్బాయి. అతడు చెవిటివాడు. అమాయకుడైన పల్లెటూరి యువకుడు పట్నంలో అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడ ప్రయోగశాలతో చేరిన అతడిపై ఓ ప్రయోగం జరుగుతుందట. ఆ తర్వాత హీరో జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ అని చెప్పుకొంటున్నారు. విభిన్న కథగా అనిపిస్తున్న ఇది.. తెర మీద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











