గాంధీ జయంతి రోజే చిరంజీవి.. అదే కరెక్ట్ అంటున్న రామ్ చరణ్.. ఫైనల్‌గా డిసైడ్ అయిన మెగా ఫ్యామిలీ

సినిమా ఇండస్ట్రీలో రారాజుగా ఏలి ఆ తర్వాత రాజకీయ గడప తొక్కారు మెగాస్టార్ చిరంజీవి. అయితే అక్కడ ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. దీంతో మరోసారి సినిమానే తన ఫైనల్ టార్గెట్ అని డిసైడ్ అయిన చిరు.. ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ తిరిగి రావడం పట్ల ప్రేక్షకలోకం ఘన స్వాగతం పలికింది. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న కొత్త సినిమా సైరా నరసింహా రెడ్డి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చేసిందనేది తాజా సమాచారం.

మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 15 వ తేదీనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తికావనే ఉద్దేశంతో దానిని అక్టోబర్ 2 కు వాయిదా వేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ తేదీ విషయమై సుదీర్ఘంగా ఆలోచించిన చిరంజీవి, రామ్ చరణ్ చివరకు గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నే సైరాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారట. ఇది స్వాతంత్ర సమరయోధుడి కథ కాబట్టి ఈ తేదీనే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇలా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్లో విడుదలకి ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాలు సంక్రాంతి వైపుకి వెళుతున్నాయని తెలుస్తోంది.

Ram Charan takes final Decision on Sy Raa Narasimhaa Reddy release

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా 'సైరా నరసింహా రెడ్డి' తెరకెక్కుతోంది. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా.. తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్, భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X