రామ్ చరణ్, తమన్నాలపై హాట్ రూమర్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన 'రచ్చ' చిత్రం మెగా మాస్ హిట్‌గా నిలిచింది. సినిమా సూపర్ కలెక్షన్లతో రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడిగు పెట్టింది. మెగా అభిమానులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
కాగా...రామ్ చరణ్, తమన్నాలపై ఓ రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. జంజీర్ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతున్న చెర్రీ....ఈ చిత్రంలో తమన్నాను హీరోయిన్‌గా తీసుకోమని దర్శకుడు అపూర్వ లఖియాకు రికమండ్ చేశాడట. అయితే అపూర్వ లఖియా నో చెప్పడంతో చేసేది లేక సైలెంట్ అయిపోయాడని అంటున్నారు.
అయితే ఈ రూమర్స్‌ను మెగా అభిమానులు ఖండిస్తున్నారు. 'రచ్చ' చిత్రం తర్వాతనే రామ్ చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రానికి, వివి వినాయక్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాలకు ఆమెనురికమండ్ చేయని చెర్రీ 'జంజీర్' చిత్రానికి ఎందుకు రికమండ్ చేస్తాడు? ఆ రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు.
ఆ విషయం పక్కన పెడితే...తమన్నాను మెగా ఫ్యామిలీ హీరోలంతా వరుస పెట్టి బుక్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తొలుత అల్లు అర్జున్‌తో బద్రీనాథ్ చిత్రంలో నటించిన తమన్నా...ఆ తర్వాత చెర్రీతో రచ్చ చేసింది. ఈ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటింబచోతోంది. తమన్నాతో చేసే అవకాశం వస్తే బాగుండు అంటూ 'రచ్చ' ఆడియో వేడుకలో చిరంజీవి కూడా ఆమెపై మనసు పారేసుకున్నారు.


Click it and Unblock the Notifications











