మెగా ప్రిన్సెస్‌కు అంబానీ బంగారు ఊయల గిఫ్ట్.. అసలు సంగతేంటో చెప్పిన రామ్ చరణ్!

మెగా ఫ్యామిలీలోకి కొత్తగా అడుగుపెట్టిన ప్రిన్సెస్ బారసల వేడుక మరిగంటల్లో జరగబోతుంది. ఇప్పటికే ఈ వేడుకకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రామ్ చరణ్, ఉపాసన కుమార్తెకు ముకేశ్ అంబానీ ఓ బంగారు ఊయలను గిఫ్ట్ గా పంపారని ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతోంది. దీనిపై రామ్ చరణ్‌ టీమ్‌ స్పందించింది. అవన్నీ అవాస్తలేనని చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

బిడ్డ రాకతో అంతా మంచే...:ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం మెగా ఇంట వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగి 11 ఏళ్లు దాటిన పిల్లలు లేరని అంతా కామెంట్స్ చేసేవారు. ఆలోటు ఇన్నేళ్లకు తీరింది. జూన్ 20వతేదీన రామ్ చరణ్ ఉపాసనలకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. మెగా ఇంట సంబరాలు మొదలు అయ్యాయి. ఇగ చిరంజీవి అయితే మహాలక్ష్మి వచ్చిందంటూ మురిసిపోయారు. బిడ్డ రాకతో తమకు మంచి జరుగుతుందోని చెప్పుకొచ్చాడు.

Ram charan team clarity on ambani cradle gift news

రామ్ చరణ్ టీం క్లారిటీ:ఆ బేబీ భూమిపైకి వచ్చి 11 రోజులైందో లేదో ఇప్పటికే పెద్ద స్టార్ అయిపోయింది. అయితే తాజాగా రామ్ చరణ్ ఉపాసనల బేబీకి వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఓ బంగారు ఊయలను గిఫ్ట్ గా పంపారన్న వార్త వైరల్ అవుతోంది. ఉదయం నుంచి అన్ని న్యూస్ వెబ్ సైట్స్, ఛానెల్స్.. చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై రామ్ చరణ్ టీం స్పందించింది. అవన్నీ అవాస్తవాలు అని క్లారిటీనిచ్చింది.

Ram charan team clarity on ambani cradle gift news

చెక్క ఉయ్యాలనే...:చరణ్‌, ఉపాసనల పాప కోసం... ముఖేశ్‌ అంబానీ బంగారు ఊయల పంపలేదట. అయితే బంగారు ఊయలలోనే పాపకు వేడుకలు చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. కాగా ఈ వార్తలపై తాజాగా చరణ్‌ టీమ్‌ రెస్పాండ్ అవ్వగా... అవాస్తవాలేనని చెప్పింది. ప్రజ్వల ఫౌండేషన్‌ వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఉయ్యాలనే ఈ వేడుకల్లో ఉపయోగిస్తున్నట్లు వివరించింది.

Ram charan team clarity on ambani cradle gift news

అసలు సంగతి ఇది..:ఇక ప్రజ్వల సంస్థ వారు సిద్ధం చేసిన ఊయలను ఇటీవల ఉప్సీ ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకున్న విషయం తెలిసిందే. ప్రజ్వల ఫౌండేషన్‌ నుంచి ఇలాంటి హృదయపూర్వక బహుమతి పొందినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఉపాసన వెల్లడించింది. చేతితో తయారు చేసిన ఈ ఉయ్యాలకు ప్రాముఖ్యత ఉంది. బలం, ఆశకు ఇది ప్రతీక. పరివర్తన, ఆత్మగౌరవాన్ని ఇది సూచిస్తుందని రాసుకొచ్చింది. తనకు పుట్టబోయే బిడ్డ కూడా ఈ విలువలు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పోస్ట్‌ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X