రామ్ చరణ్ నెక్ట్స్ నాగ్ డైరక్టర్ తో ...?

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్ తదుపరి చిత్రం నాగార్జునతో రీసెంట్ గా గ్రీకు వీరుడు వంటి ప్లాప్ చిత్రం అందించిన దశరధ్ తో అని తెలుస్తోంది. ఈ మేరకు దశరథ్ రీసెంట్ గా రామ్ చరణ్ ని కలిసి ఓ కథ వినిపించారని, వెంటనే కథ ఓకే చేసారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం దశరథ్ అదే స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ లోగా రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందే చిత్రం పూర్తి చేసుకుని వస్తారని అంటున్నారు.

మరో ప్రక్క 'జంజీర్‌' (తుఫాన్) రీమేక్ సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రామ్‌చరణ్‌. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా విమర్శకుల చేత ఓ రేంజిలో కామెంట్స్ చేయించేలా చేసింది. అయితే పట్టువదలకుండా తాజాగా మరో చిత్రం చేయడానికి రామ్‌చరణ్‌ సన్నాహాలు చేసుకొంటున్నారని తెలిసింది.

ఈ కొత్త బాలీవుడ్ చిత్రానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. 'జంజీర్‌' చిత్రీకరణ ముంబయిలో జరుగుతున్నప్పుడు చరణ్‌కి సల్మాన్‌ ఆతిథ్యం ఇచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో 'ఎవడు' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు కూడా ఆ సెట్లో సల్మాన్‌ ఖాన్‌ సందడి చేశారు. అప్పట్నుంచి వీరిద్దరూ కలిసి ఓ సినిమాకి పనిచేస్తారనే ప్రచారం మొదలైంది.

ఇటీవల రామ్‌చరణ్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2014 ఏడాది ప్రారంభంలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, జంజీర్ లో ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యారని, అది ఈ కొత్త చిత్రంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుని సెట్స్ మీదకు వెళ్తారని చెప్తున్నారు.

ఇక ప్రముఖ దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ కూడా రామ్‌చరణ్‌ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో చరణ్‌ నటిస్తేనే బాగుంటుందని అశుతోష్‌ భావిస్తున్నారట. 'మగధీర' చిత్రాన్ని చూశాక ఆయన ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.ఇందుకోసం ప్రత్యేకంగా మగధీర ప్రింట్ తెప్పించుకుని మరీ చూసాడని చెప్తున్నారు. రామ్ చరణ్ కూడా ఆయనతో చేయాలని ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. 'మగధీర' చూసి ఇంప్రెస్ అయ్యే ఆఫర్...? రామ్ చరణ్ ఇక ఈ చిత్రం భారీవ్యయంతో ఈ చిత్రం రూపొందబోతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X