RC 15: మరో కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్న దిల్ రాజు.. అప్పుడే బిగ్ రిలీజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ 15వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని నిర్మాత దిల్ రాజు ఇదివరకే పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఈ సినిమా శంకర్ తన స్టైల్ కు తగ్గట్టుగానే భారీగా తెరపైకి తీసుకురాబోతున్నట్లు కూడా వివరణ ఇచ్చారు.

బడ్జెట్ పరంగా కూడా ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఇక రామ్ చరణ్ కెరీర్ లోనే కాకుండా దిల్ రాజు కెరీర్ లో కూడా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరపైకి రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే ఇప్పటికే దాదాపు సగానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని లొకేషన్స్ లో సినిమా షూటింగ్ అయితే కొనసాగిస్తున్నారు. వీలైనంత వరకు ఎక్కువగా నిజమైన గ్రామాల్లోనే షూటింగ్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Ram charan tej 15th project release to plan at 2023 summer

ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో అయితే కొంత కన్ఫ్యూజన్ ఉంది. అసలైతే మొదట ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఈ ఏడాది దసరా సమయానికి విడుదల చేయాలని అనుకున్నారు. తర్వాత దీపావళికి రావచ్చు అని కూడా అన్నారు. ఇక మళ్ళీ ఆ తర్వాత 2023 సంక్రాంతికి తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అని కూడా తెలియజేశారు. కానీ శంకర్ అనుకోకుండా కమలహాసన్ ఇండియన్ 2 సినిమాను మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు మళ్ళీ కొత్త బ్రేక్ పడింది.

ఇక ఈ ఏడాది చివరిలోపు రెగ్యులర్ షూటింగ్ అయితే పూర్తి చేయాలని అనుకుంటున్నారు. లేదా జనవరి ఫిబ్రవరి నెలలో దాదాపు సినిమాకు సంబంధించిన మొత్తం పనులు ఫినిష్ అయ్యేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ప్లాన్ ప్రకారం అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2023 ఏప్రిల్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తప్పకుండా అదే సమయానికి విడుదల చేయాలి అని శంకర్ కూడా మరొక ప్లాన్స్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కూడా దిల్ రాజు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X