పవన్ మెర్సిడెజ్ బెంజ్ ఎయువి కార్లో నిశ్చితార్థానికి వెళ్లనున్న రామ్ చరణ్...!?
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్ నిశ్చితార్ధానికి హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఫాంహౌస్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే కూడా బార్‌కోడింగ్‌తో ఉన్న యాక్సెస్ కార్డు కావలసిందే. ఇందుకోసం ఎటిఎమ్ కార్డు సైజులో ఉన్న ఈ యాక్సెస్ కార్డులను అహ్వానితులకు అందజేశారు. అంతేకాదు కార్‌పార్కింగ్ దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటుచేశారు.
చిరు ఫ్యామిలీలో విభేదాలు అంటూ మీడియాలో వస్తున్న పుకార్లకి పవన్ కళ్యాణ్ పటాపంచలు చేయనున్నారు. అందుకు కారణం పవన్‌కళ్యాణ్ ఈ మధ్యనే కొత్తగా కొన్న కారులో రామ్ చరణ్ ను తానే స్వయంగా నిశ్చితార్ధానికి తీసుకెళ్ళనున్నారని సమాచారం. రామ్ చరణ్ నిశ్చితార్థ వేడుక ఈ రోజు జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు కేవలం అబ్బాయి ఎంగేజ్‌మెంట్ కోసమే, ఈమధ్యనే ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యువి వాహనాన్ని పవన్ కొన్నట్లు సమాచారం.
ఈ మెర్సిడెజ్ బెంజ్ జి55ఎఎంజి ఎస్యూవి కారుకి ఇండియాలో ఇంకా బుకింగ్ దశలోనే ఉండగా దీనిని పవన్ సొంతం చేసుకున్నారు. పవన్ ఈ వేడుక కోసమే ఈ బెంజ్ కారును ఆఘ మేఘాల మీద తెప్పించినట్లు సమాచారం. ఈ మెర్సిడెజ్ బెంజ్ ఎయువి మోడల్ వాహనాన్ని ఈ వేడుకతోనే తొలిసారిగా ఆయన వాడుతున్నారు. అన్న కొడుకు రామ్ చరణ్ పట్ల తనకున్న ప్రేమను పవన్ కల్యాణ్ ఇలా చూపిస్తున్నాడు. దీంతో మెగాస్టార్ కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ కు ఈమధ్య పడడం లేదనీ, వారి మధ్య మనస్పర్ధలొచ్చాయనీ మీడియాలో వస్తున్న గాసిప్స్ కి తెరపడుతోంది.
ఇదిలా ఉంచితే వధూవరులు ధరించే ఎంగేజ్ మెంట్ ఉంగరాలకు ఇరవై కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. ముంబాయ్ లో ఆర్డరిచ్చి వీటిని ప్రత్యేకంగా చేయించారట.!ఈ వేడుకకి కొందరు ఇండస్ట్రీ పెద్దలని మాత్రమే ఆహ్వానించారు.


Click it and Unblock the Notifications











