రామ్ చరణ్ తదుపరి..ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ తో!?
కులాంతర వివాహం పాయింట్ తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఆరంజ్ రూపొందనుందని సమచారం. మొదట అనుకున్న కథలో పాయింట్ హిందీ చిత్రం బచానో..ఓ హసీనో ను పోలి ఉండటంతో దాన్ని కాదని ముందుగా భాస్కర్ చెప్పిన కులాంతర వివాహంను ఈ కథలో కలిపి చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక భాస్కర్ కూడా తన కథలో ఏదో ఒక సామాజిక సందేశాన్ని చెప్పి ఫ్యామిలిలను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మొదటి బొమ్మరిల్లు చిత్రంలో తండ్రి..కుమారుడు మధ్య రిలేషన్ చూపితే రెండో చిత్రం పరుగులో ప్రేమ వివాహాలు..తండ్రి..కూతుళ్ల నేపధ్యంలో చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో ఇంటర్ కాస్ట్ మ్యారేజస్ అనే పాయింట్ పై చర్చించనట్లు చెప్తున్నారు. అయితే ఆ పాయింటును డీప్ గా కాక కథలో ఓ లేయర్ లా మాత్రమే వాడి కమర్షియాలిటీ తగ్గకుండా జాగ్రత్తపడనున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. జెనీలియా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. పవన్ కళ్యాన్ కూడా గెస్ట్ గా చేసే అవకాశం ఉంది. అంజనా ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











