Ram Charan లైనప్ మామూలు లేదు.. ఐదు మంది దర్శకులతో బిగ్ బడ్జెట్ మూవీస్ ఫిక్స్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత మళ్లీ అదే తరహాలో పాన్ ఇండియా మార్కెట్ వద్ద తన రేంజ్ ను పెంచుకోవాలని అనుకుంటున్నాడు. మధ్యలో ఆచార్య కొంత నిరుత్సాహపరిచినప్పటికీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ లైనప్ అయితే మామూలుగా లేదని అనిపిస్తోంది. మొత్తంగా ఐదు మంది విభిన్నమైన దర్శకుల నుంచి రామ్ చరణ్ సినిమాలు రాబోతున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ముందుగా శంకర్ సినిమా

ముందుగా శంకర్ సినిమా

ముందుగా అయితే రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఇక మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. దర్శకుడు శంకర్ ఈ సినిమాను ఒక మంచి సందేశం తో పాటు యాక్షన్ ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

300 కోట్ల బడ్జెట్

300 కోట్ల బడ్జెట్

శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ ఎవరితో చేస్తాడు అనే విషయంలో కూడా ఇటీవల క్లారిటీ వచ్చేసింది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు పూర్తిస్థాయిలో ఒక డిఫరెంట్ కథను రెడీ చేయడంతో రామ్ చరణ్ తేజ్ ఒప్పుకున్నాడు. ఆ సినిమాను దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్లో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా నిర్మించబోతున్నట్లు కూడా మరో టాక్ వచ్చింది. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.

లైన్ లో కన్నడ డైరెక్టర్

లైన్ లో కన్నడ డైరెక్టర్

అయితే రామ్ చరణ్ తేజ్ ఆ మధ్యలో సీతారామం దర్శకుడు హాను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లుగా ఒక టాక్ అయితే వచ్చింది. కానీ అసలు ఇంతవరకు ఆ దర్శకుడు రామ్ చరణ్ ను కలవలేదని తెలుస్తోంది. కానీ కన్నడ దర్శకుడు నర్థన్ తో మాత్రం సినిమా చేయాలి అని రామ్ చరణ్ అనుకుంటున్నాడు. ఇదివరకే ఆ దర్శకుడు చెప్పిన కథ రామ్ చరణ్ కు బాగా నచ్చిందట. త్వరలోనే ఈ కాంబినేషన్ పై కూడా అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సుకుమార్ కాంబో

సుకుమార్ కాంబో

అలాగే రామ్ చరణ్ తేజ్ ఇంతకుముందే సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. వరుస ఇంటర్వ్యూలలో రాజమౌళి కూడా ఆ మధ్య వీరి కాంబినేషన్ కోసం ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తున్నట్లు ఒక సీన్ కూడా చెప్పాడు. అందులో ఇంట్రడక్షన్ సీన్ గురించి తనతో సుకుమార్ చెప్పినట్లు కూడా రాజమౌళి చెప్పాడు. ఇక ఈ ప్రాజెక్టు పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

KGF దర్శకుడితో కూడా..

KGF దర్శకుడితో కూడా..

ఇక ఆ మధ్యకాలంలో రామ్ చరణ్ తేజ్ ను ప్రత్యేకంగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలుసుకున్న విషయం తెలిసిందే. వీరి మధ్యలో ఒక ప్రాజెక్టు గురించి చర్చలు కూడా జరిగాయి. అయితే దాని గురించి మళ్ళీ ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తప్పకుండా ప్రశాంత్ నీల్ మాత్రం రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఒక ఆలోచనలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ప్రశాంత నీల్ యూనివర్స్ లో రాంచరణ్ కూడా కలిసే అవకాశం ఉన్నట్లు మరొక టాక్ వినిపిస్తోంది. మరి ఈ లైనప్ కాంబినేషన్స్ ను రామ్ చరణ్ తేజ్ ఎంత త్వరగా పూర్తి చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X